శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

Published : Aug 29, 2022, 10:19 AM IST
శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

సారాంశం

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా  వెల్లడించారు.   

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నట్టుగా గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. అందులో కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని గుత్తా కోరారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 175 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద చేసింది. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,951కి చేరింది. తాజాగా కరోనా నుంచి 225 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,27,736కి చేరింది. కొత్తగా కరోనా మరణాలు సంభవించలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,111గా ఉంది. 

 ఇక, గడిచిన 24 గంటల్లో 12వేల 590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన 175 కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 98 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,077 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu