మహిళా కానిస్టేబుల్‌పై లెక్చరర్ దాడి.. వీడియో వైరల్, కేసు నమోదు

Siva Kodati |  
Published : Mar 22, 2023, 05:41 PM IST
మహిళా కానిస్టేబుల్‌పై లెక్చరర్ దాడి.. వీడియో వైరల్, కేసు నమోదు

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో విధుల్లో వున్న మహిళా కానిస్టేబుల్‌పై లెక్చరర్ దాడి చేశాడు.  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి ఆఫ్రిన్‌పై కేసు నమోదు చేశారు ఉన్నతాధికారులు. 

నిజామాబాద్ జిల్లాలో విధుల్లో వున్న మహిళా కానిస్టేబుల్‌పై లెక్చరర్ దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. స్థానిక త్రి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ కాలేజ్ వద్ద ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండంతో ఓ మహిళా కానిస్టేబుల్ మంగళవారం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కాలేజ్ లెక్చరర్ అఫ్రిన్ ఆమెపై చేయి చేసుకున్నాడు. పరీక్ష పూర్తికాకముందే గేటు వద్దకు ధర్మపురి హిల్స్ మైనార్టి కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా వస్తున్న అఫ్రిన్ వచ్చాడు.

దీంతో అతనిని మహిళా కానిస్టేబుల్ అడ్డుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆఫ్రిన్.. మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టాడు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి ఆఫ్రిన్‌పై కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !