తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ను నిరసిస్తూ ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును నిరసిస్తూ బీజేపీ మహా ధర్నా చేయనుంది.
పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ, ప్రగతి భవన్ వద్ద విపక్ష పార్టీలు, విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.
మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలిసి ఈ నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించనున్నారు.
బుధవారంనాడు మధ్యాహ్నాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులకు మద్దతుగావ వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకొచ్చాయి. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.
టీఎప్ పీఎస్ సీ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కొడుకు పాత్ర ఉన్నందున వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విషయమై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ కోరింది. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నిరుద్యోగ మహాధర్నా చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ పార్టీ నేతలను కోరారు.
also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: కాంగ్రెస్ నేతలు, గవర్నర్ మధ్య ఆసక్తికర సంభాషణ
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా సంస్థలకు బెదిరింపులు ఎదురౌతున్నాయని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఆయా సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవడంతోపాటు వారి పక్షాన పోరాటం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నిర్ణయించింది. ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావంగా తెలపాలని నిర్ణయించారు. వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో కమిటీని ఏర్పాటు చేశారు బండి సంజయ్.