కన్నపిల్లలపై అత్యాచారం, వీడియో రికార్డింగ్: తండ్రికి జీవిత ఖైదు

Published : Jan 01, 2021, 12:06 PM IST
కన్నపిల్లలపై అత్యాచారం, వీడియో రికార్డింగ్: తండ్రికి జీవిత ఖైదు

సారాంశం

కన్నపిల్లలపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడికి  హైద్రాబాద్ ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదును విధించింది.  

హైదరాబాద్: కన్నపిల్లలపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడికి  హైద్రాబాద్ ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదును విధించింది.

కన్నపిల్లలపై అత్యాచారం చేసిన దుండగుడి బారి నుండి పిల్లలను ఎట్టకేలకు బంధువుల సహాయంతో బయటపడ్డారు. పిల్లలపై అత్యాచారం చేసే సమయంలో వీడియోలు తీశాడు దుండగుడు అమర్ నాథ్.

ఈ వీడియోలను అడ్డం పెట్టుకొని వారిపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. రోజు రోజుకి  ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో పిల్లలు తట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

దీంతో ధైర్యం చేసి బాధిత పిల్లలిద్దరూ బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో పిల్లలతో కలిసి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆదారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడిపై చార్జీషీట్ దాఖలు చేశారు.2019లో ఇద్దరు పిల్లలపై దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చార్జీషీట్ లో పేర్కొన్నారు.

నిందితుడి ఆ ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ప్రాసిక్యూషన్ నిరూపించింది. దీంతో దుండగుడు అమర్ నాథ్ పై ఎల్బీనగర్ కోర్టు  జీవిత ఖైదును విధించింది.
 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు