
2016లో జరిగిన ఎం.పుల్లయ్య హత్య కేసులో ఆయన భార్య ప్రవళికకు ఎల్బీనగర్ రెండో అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ హత్యతో సంబంధం ఉన్న మైనర్ బాలుడిపై విచారణ జువెనైల్ జస్టిస్ బోర్డులో పెండింగ్ లో ఉంది.
‘డెక్కెన్ క్రానికల్’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.పుల్లయ్య, ప్రవళిక భార్యా భర్తలు. వీరిద్దరూ ఎల్బీనగర్ లోని ఓ ఇంట్లో నివాసం ఉండేవారు. అయితే భార్య ఓ మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆయన దీనికి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మైనర్, భార్య కలిసి పుల్లయ్యను ఇంట్లోనే హత్య చేశారు.
దారుణం.. రోడ్డుపై నిలబడిన స్కూటీని ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి.. (వీడియో)
అనంతరం భర్త మృతదేహాన్ని గోనె సంచిలో నింపి ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయితే ఈ విషయంపై పోలీసులు వారిని ప్రశ్నించారు. వారికి పోలీసులు సమాధానం ఇస్తూ.. బాలుడు తన మేనళ్లుడు అని, తన భర్త మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్నామని చెప్పింది.
ప్రవళిక, మైనర్ బాలుడు శారీరక సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. దీనిపై పుల్లయ్య అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎల్బీనగర్ లోని తమ ఇంట్లో హత్య చేసి మృతదేహాన్ని పారవేసేందుకు బయలుదేరారు. మరణానికి గల కారణాలేంటని పోలీసులు ప్రశ్నించగా.. అస్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కదులుతున్న ఆటోలో మహిళ గొంతుకోసి దారుణ హత్య.. తానూ కోసుకుని..
దర్యాప్తులో భాగంగా ప్రవళికను, మైనర్ బాలుడిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీనికి భర్త పుల్లయ్య అభ్యంతరం చెప్పాడని, దీంతో వారే అతడిని హత్య చేశారని గుర్తించారు. దీనిపై కోర్టులో అప్పటి నుంచి విచారణ సాగింది. తాజాగా కోర్టు ఆమెకు శిక్ష విధించింది.