సీఎల్పీ చిచ్చు: సుధీర్ రెడ్డి, కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Jan 17, 2019, 10:22 AM IST
Highlights

అధికారంలోకి వచ్చి పదవులు చేజిక్కించుకోవాలనుకున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలు షాకిచ్చాయి. టీఆర్ఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ చతికిలపడింది. పార్టీపరంగా ఎలాంటి పదవులు రానప్పటికీ.. కేబినెట్ హోదాతో సమానమైన సీఎల్పీ నేత పదవికి కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. 

పార్టీ తరపున గెలిచిన 19 మంది శాసనసభ్యుల్లో సీఎల్పీ నేత అయ్యే అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై గత కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు.

ఈ క్రమంలో జూనియర్లు సైతం తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సీఎల్పీ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీలో చాలా మంది పనికిమాలిన నాయకులు ఉన్నారని.. వారి కంటే తానే సీనియర్‌నంటూ ఆయన వాదిస్తున్నారు.

పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పానని తెలిపారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని...  అయితే రాహుల్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 ఎంపీ సీట్లు రావాలంటే.. పార్టీలో ప్రక్షాళన జరగాలన్నారు. 
 
click me!