మాజీ సీఎం ఇంటిపై మనసుపడ్డ కేటీఆర్

Published : Jan 17, 2019, 08:53 AM IST
మాజీ సీఎం ఇంటిపై మనసుపడ్డ కేటీఆర్

సారాంశం

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటిపై మనసుపారేసుకున్నారు. 

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటిపై మనసుపారేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేయగా.. కేటీఆర్, ఒమర్ ల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది.

 

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. తన ఇంటిఫోటోని ట్విట్టర్ లో పోస్టు చేశారు. మంచుతో కప్పబడి ఉన్న ఆ ఇల్లు  చాలా అందంగా ఉంది. ఆ ఇంటి ని ముచ్చటపడిన కేటీఆర్.. తనకు అలాంటి ఇల్లు ఉంటే బాగుండేదని ట్వీట చేశారు.

 

కాగా.. కేటీఆర్ ట్వీట్ కి.. ఒమర్ స్పందించారు. ‘‘మా ఇంటిని మీ ఇల్లే  అనుకోండి. మీకు నచ్చినప్పుడు వచ్చి.. ఇక్కడ ఉండొచ్చు’’ అంటూ ఒమర్ కేటీఆర్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. కాగా.. దీనిపై మళ్లీ కేటీఆర్ వెంటనే స్పందించారు. మీ కామెంట్స్ ని నేను సీరియస్ గా తీసుకుంటాను అంటూ కేటీఆర్ సరదాగా ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్ల సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...