అడ్వకేట్ దంపతుల దారుణ హత్య..ఎవరీ కుంట శ్రీనివాస్?

Published : Feb 18, 2021, 07:44 AM IST
అడ్వకేట్ దంపతుల దారుణ హత్య..ఎవరీ కుంట శ్రీనివాస్?

సారాంశం

పెద్దపల్లి సమీపంలో జరిగిన లాయర్ దంపతులు వామన్ రావు, నాగమణి దంపతుల కేసులో కుంట శ్రీనును ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఎవరీ కుంట శ్రీను ఆసక్తి సర్వత్రా నెలకొంది.

పెద్దపల్లి జిల్లాలో పట్టపగలే హత్యలు జరిగాయి.  హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతులను హత్య చేశారు దుండగులు. కారులో వెళ్తున్న వామనరావు.. అతని భార్య నాగమణిపై కత్తులతో దాడి చేశారు. అడ్వకేట్ వామన్ రావు చనిపోతూ… తనపై హత్య చేసిన వ్యక్తి పేరు కుంట శ్రీను అని చెప్పారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామం దగ్గరలో పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు దంపతులపై దాడి చేశారు దుండగులు. కోర్టు పనిమీద మంథనికి కారులో వచ్చి… తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా… వీళ్ళని కల్వచర్ల దగ్గర అడ్డుకుని కత్తులతో విచరక్షణారహితంగా దాడి చేశారు. దంపతుల్ని కారు దిగనీయకుండానే…. లోపలే దాడికి పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉన్న దంపతులను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే చనిపోయారు. వామనరావు, అతని భార్య  ఇద్దరు హైకోర్టు అడ్వకేట్లు. గట్టు లా చాంబర్స్ పేరుతో లా ఫర్మ్ ను నడుపుతున్నారు.

దుండగుల దాడి తర్వాత కొద్దిసేపు రోడ్డు పైనే ప్రాణాలతో పోరాడారు అడ్వకేట్ వామనరావు. ఇదే టైంలో అక్కడున్నవాళ్లు నిందితులు మీకు తెలుసా అని అడిగినప్పుడు… తెలుసు అంటూ తల ఊపారు వామనరావు. తర్వాత కుంట శీను దాడి చేశారని..అతనిది గుంజపడగ అని చెప్పాడు.

అడ్వకేట్ వామన్ రావు… తనపై దాడి చేశారని చెప్పిన కుంట శీనుది మంథని మండలం గుంజపడగ గ్రామం. ప్రస్తుతం శీను మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. గుంజపడగ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు. పెద్దపల్లి జెడ్పి చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రధాన అనుచరుడని ప్రచారం జరుగుతోంది. కుంట శీనుకు వ్యతిరేకంగా వామనరావు కేసు వేశాడని.. ఆ కక్షతోనే కుంట శీను దాడి చేశాడని అనుమానిస్తున్నారు. దాడి నుంచి కారు డ్రైవర్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు.

గతంలో వామన్ రావు రాజకీయనేతల అవినీతిని ప్రశ్నిస్తూ అనేక కేసులు వేశారు.  ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఈ కేసులను ఫైల్ చేశారు.  ఆ కక్షతోనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే తనకు ప్రాణహాని ఉందని… రక్షణ కల్పించాలని వామన్ రావు గతంలో ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. అందరికీ సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదంటూ ఆయన అభ్యర్థనను సర్కార్ తిరస్కరించినట్టు హైకోర్టు సీనియర్  అడ్వకేట్స్ చెబుతున్నారు. వామన్ రావు హత్యను హైకోర్టు అడ్వకేట్స్ ఖండించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu