జీవన్ రెడ్డికి ఫోన్: తీపి కబురు అందించిన లగడపాటి

Published : Dec 10, 2018, 10:46 AM IST
జీవన్ రెడ్డికి ఫోన్: తీపి కబురు అందించిన లగడపాటి

సారాంశం

ఆదివారం జీవన్ రెడ్డి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద ఉండగా లగడపాటి నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. 

జగిత్యాల: జగిత్యాల ప్రజా ఫ్రంట్ అభ్యర్థి జీవిన్ రెడ్డికి ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తీపి కబురు అందించారు. జీవన్ రెడ్డికి ఆయన ఫోన్ చేశారు. "అన్నా.. నువ్వు గెలుస్తున్నావ్‌. ప్రజాఫ్రంట్‌ అధికారంలోకి వస్తుంది. నీకు మంత్రి పదవి కూడా వస్తుంది" అని ఆయన జీవన్‌రెడ్డికి చెప్పారు. 

ఆదివారం జీవన్ రెడ్డి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద ఉండగా లగడపాటి నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. 

ఇరువురు తాజా రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు.   తనకు లగడపాటి ఫోన్‌చేశారన్న విషయాన్ని జీవన్‌రెడ్డి కార్యకర్తలకు చెప్పారు. దీంతో వారిలో ఉత్సాహం ఉరకలు వేసింది. జగిత్యాల స్థానం టీఆర్‌ఎస్‌ చేతికి వెళ్తుందని గత రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో లగడపాటి వ్యాఖ్యలు జీవన్ రెడ్డికి ఊరటనిచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు