రెండో వివాహం.. భర్త వేధింపులు తాళలేక మహిళా డాక్టర్ ఆత్మహత్య...

Published : Mar 17, 2022, 07:06 AM IST
రెండో వివాహం.. భర్త వేధింపులు తాళలేక మహిళా డాక్టర్ ఆత్మహత్య...

సారాంశం

ఇద్దరిదీ రెండో పెళ్లి.. ఇద్దరూ గౌరవనీయమైన డాక్టర్ వృత్తిలో ఉన్నవారే. అయినా వరకట్న వేధింపులు తప్పలేదు. కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక.. ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సైదాబాద్ : ఇరువురు medical professionలో ఉన్నారు. ఇరువురిదీ second marriage. వరకట్న వేధింపులు తట్టుకోలేక భార్య ఉరేసుకుని Suicide చేసుకున్న ఘటన ఈ నెల 8న మలక్ పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. భర్తను ఈనెల 14న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నల్గొండ జిల్లా దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె, వైద్యురాలైన కుమార్తె స్వప్న (38) తొలి వివాహం మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తితో చేశారు. ఖమ్మం జిల్లా పీహెచ్ సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో Divorce తీసుకుంది.

కర్నూలుకు చెందిన డాక్టర్ ఎం.శ్రీధర్ తో 2015 ఏప్రిల్ లో రెండు వివాహం జరిగింది. రూ.10లక్సల నగదు, 14 తులాల బంగారం కట్నం కింద అందజేశారు. అనంతరం ఆమెకు నగరంలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎండీ(ఎస్ పీఎం) సీటు వచ్చింది. సైదాబాద్ డివిజన్ వెంకటాద్రినగర్ లో వీరు ఉంటున్నారు. ఏడాది అనంతరం అదనపు కట్నం కోసం భర్త వేధించడం ప్రారంభించాడు. మానసిక వేదనకు గురైన ఆమె ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా మానసిక వైద్యుడికి చూపించారు.

ఇంట్లో సగ భాగం, తల్లి బంగారు నగలు తీసుకురావాలని శ్రీధర్ పలుమార్లు ఒత్తడి తెచ్చాడని ఆమె తండ్రి పోలీసులకు వివరించారు. ఈనెల 8న స్వప్న ఆత్మహత్య చేసుకుందని శ్రీధర్ సమాచారం ఇవ్వడంతో అనుమానంవచ్చి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ శ్రీధర్ ను ఈ నెల 14 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని మలక్ పేట ఏసీపీ ఎన్. వెంకటరమణ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఎక్కువగా phone మాట్లాడుతోందని అత్త మందలించడంతో నవవధువు suicide చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. బోరబండలోని భరత్ నగర్ కు చెందిన పవన్ తో సికింద్రాబాద్ అడిక్ మెట్ కు చెందిన శిల్ప (22) మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అధికంగా ఫోన్ మాట్లాడటంపై అత్తాకోడళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో శిల్ప ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప గర్భం దాల్చినట్లు సమాచారం. 

కాగా, ఇలాంటి ఘటనలే నిన్న, మొన్న కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త extra dowry తేవాలని వేధించడంతో ఓ married women కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కాంపెళ్లి మమత (24), రమేష్ లు ప్రేమించుకోగా 2018లో పెద్దలసమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదిన్నరకి పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. కొన్నాళ్లకు harrasement మొదలయ్యాయి. దీంతో మమత సోమవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్రగాయాలయ్యాయి. మొదట జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.  అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. 

దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు జగిత్యాల వచ్చి పాత బస్టాండ్ ఎదురుగా మధ్యాహ్నం మృతదేహంతో ఆందోళనకు దిగారు.  గంటసేపు ఆందోళన చేయగా డి.ఎస్.పి ఆర్ ప్రకాష్, పట్టణ సీఐ కే కిషోర్ వారితో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా మమత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తన కుమార్తె మమత అత్తమామలు రాజవ్వ, లక్ష్మణ్. భర్త రమేష్,  బావ మహేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చారని మమత తల్లి నక్క సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు