కెసిఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యం

Published : Aug 14, 2017, 07:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
కెసిఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యం

సారాంశం

కెసిఆర్ ను పర్సనల్ గా విమర్శించం సర్కారుపైనే మా పోరాటం సంసారం చక్కదిద్దుకునే పనిలో ఉన్నం ఆరు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ సిఎం కెసిఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా. కెసిఆర్ పై వ్యక్తిగతంగా తాము టార్గెట్ చేసి విమర్శలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలప మీదనే మా పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము సంసారం చక్కదిద్దుకునే పనిలో పడ్డామన్నారు కుంతియా. పార్టీ కమిటీల నిర్మాణం పై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆరు నెలల ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పాలనలో జిమ్మిక్కులు తప్ప ఎలాంటి ప్రయోజనాలు జనాలకు అందడంలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సమన్వయ కమిటీ సైజు కొద్దిగా తగ్గించే పనిలో ఉన్నట్లు చెప్పారు కుంతియా. పార్టీలో ఉత్తమ్ మాటే ఫైనల్ అని 2019 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా కెప్టెన్ అని తేల్చి పారేశారు. ఉత్తమ్ పనితీరు పట్ల రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.  పార్టీ క్రమశిక్షణ పాటించకపోతే ఎంతటి నాయకుడైనా వేటు తప్పదని హెచ్చరించారు. పొత్తులపై కుంతియా స్పందిస్తూ అధిష్టానమే పొత్తులను ఫైనల్ చేస్తుందన్నారు. అయినా తెలంగాణలో పొత్తులపై తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదన్నారు కుంతియా.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu