పీసీసీ చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా

Published : Sep 05, 2019, 05:26 PM IST
పీసీసీ  చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా

సారాంశం

పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా కుండబద్దలు కొట్టారు. 

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని  ఆయన చెప్పారు.

ఈ  నెల రెండో వారంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కుంతియా తెలిపారు.నీటి పారుదల, విద్యుత్ శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని  ఆయన ఆరోపించారు.

ఈ విషయంలో తమ పార్టీ ఉద్యమం నిర్వహించనుందన్నారు.  కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. కేసీఆర్ సర్కార్ కుంభకోణాలను బయటపెట్టేందుకు పార్టీ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అవినీతి చోటు చేసుకొందన్నారు.  ఈ అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని కుంతియా డిమాండ్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్