నేరెళ్ల తిట్లన్నీ మాకు దీవెనలే

First Published Aug 8, 2017, 2:49 PM IST
Highlights
  • 50 ఏళ్లలో లేని ఇసుక ఆదాయం మూడేళ్లలో సాధించాం
  • ఇసుక మాఫియా అని ఎలా విమర్శిస్తారు
  • విపక్షాల తిట్లు మాకు దీవెనలుగానే భావిస్తాం
  • బిసిల మీద కూడా కేసులైనాయి దళితుల మీదే అనడం సరికాదు
  • విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలుంటాయి

 

At Vemulawada today met & consoled the hospitalised persons from the Nerella incident. Assured them of my support: justice shall prevail pic.twitter.com/LkSkg3ZVSX

— KTR (@KTRTRS) 8 August 2017

నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితులను మంత్రి కెటిఆర్ పరామర్శించారు. వేములవాడ ఆసుపత్రికి వెళ్లి నేరేళ్ల బాధితులను కెటిఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నెరేళ్లలో జరిగిన సంఘటన బాధాకరం, ఇలా జరగాలని ఎవరూ కోరుకోరు అని అన్నారు. ప్రజలు దయతలిచి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చామని, ఇలాంటి సంఘటనలను తాము ప్రోత్సహించబోమన్నారు.  

క్షణికావేశంలో లారీలు కాల్చడం, కేసులు పెట్టడం జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా జరగలేదన్నారు. ఎవరైనా రాజకీయంగా విమర్శిస్తే భరిస్తాం కానీ ఇసుక మాఫియా అని అంటే సహించేది లేదని హెచ్చరించారు. గత 50 ఏళ్లలో ఇసుక ద్వారా వచ్చిన  ఆదాయం, ఈ మూడేళ్లలో వచ్చిన ఆదాయం గమనిస్తే ఇక ఇసుక మాఫియా ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. మిడ్ మానేరును శరవేగంగా ఖాళీ చేయించడానికి ఇసుక తీస్తున్నాం అని గుర్తుంచుకోవాలన్నారు.

కేసుల్లో దళితులు, బీసీలు ఉన్నారు. అయినా దళితులపైనే కేసులు పెట్టారని ఆరోపించడం తప్పు అన్నారు కెటిఆర్. పోలీసులు మమ్మల్ని ఎందుకు హింసించారని బాధితులు ప్రశ్నించారని, Dig నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నరెళ్లలో రాజకీయ విమర్శలు సరికాదు,  వారి తిట్లు మాకు దీవెనలు గానే భావిస్తామన్నారు.

విపక్షాల వారంతా చుట్టపుచూపుగా వచ్చిన టూరిస్టులు మాత్రమేనన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మీడియా మిత్రులు అసౌకర్యానికి క్షమించాలని కోరారు. తెరాస ప్రభుత్వం ఇసుక మాఫియాను ఒప్పుకోదని స్పష్టం చేశారు. మీడియా సంయమనం పాటించాలన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక సాయం చేసి మళ్ళీ మాకు ఓటు వేయండని అడిగే కుసంస్కారం మాది కాదని కెటిఆర్ వెల్లడించారు.

click me!