న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు సహకరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
వరంగల్: శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్దరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.ఆదివారం నాడు Warangal జిల్లాలోని కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పాత కోర్టులను పునరుద్దరించాలని కేంద్రానికి విన్నవించానని ఆయన గుర్తు చేశారు. అయితే . కేంద్రం నుండి ఇంకా సానుకూలమైన స్పందన ఇంకా రాలేదన్నారు NV Ramana. పార్లమెంట్ సమావేశాల్లోనైనా దీనిపై చట్టం తీసుకొస్తారని ఆశిస్తున్నట్టుగా CJI చెప్పారు. వరంగల్ కోర్టు భవనాల సముదాయాన్ని మోడల్ కోర్టుగా చూపించాలనుకొంటున్నానని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. ఇలాంటి న్యాయ స్థానాల భవనాలు రాష్ట్రమంతా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మౌళిక వసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పనిచేయాలని అనుకోవడం దురాశే అవుతుందన్నారు ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తాయని అనుకొంటాన్నానని చెప్పారు.
also read:రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలక పాత్ర వహిస్తుంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
కేంద్రం నిధులు ఇవ్వకున్నా Telangana ప్రభుత్వం Copurt భవనాల సముధాయాలను నిర్మిస్తోందని ఆయన చెప్పారు.న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం మద్దతివ్వడాన్ని సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. Politicsల్లో న్యాయవాదుల పాత్ర తక్కువగా ఉందన్నారు. Advocates ఒక్క వృత్తికే పరిమితమౌతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవాదుల పట్ల సమాజంలో గౌరవం ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కుటుంబ అవసరాల కోసం వృత్తికే న్యాయవాదులు పరిమితమౌతున్నారన్నారు. న్యాయవాదులకు సామాజిక స్పృహ ఉండాలన్నారు. దేశ స్వాతంత్ర్య సమరంలో న్యాయవాదుల పాత్రను మరుమలేమన్నారు. గాంధీ, నెహ్రు లాంటి వారంతా ఇదే వృత్తి నుండి వచ్చినవారేనని ఆయన గుర్తు చేశారు.
న్యాయ వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను తెలుసుకొన్నానని ఎన్వీ రమణ తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు వృత్తిని కోల్పోకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించామన్నారు సీజేఐ. ఇందుకు గాను Mobile కోర్టులు దోహదపడుతాయన్నారు. అయితే ఈ కోర్టులు విస్తృతంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
గొప్ప వారసత్వ సంపదను యునెస్కో గుర్తించింది
రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించి తాను మురిసిపోయానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. మనకున్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించిందన్నారు. ఇది అందూ గర్వించాల్సిన విషయంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఉన్న వేయి స్థంబాల గుడి శిల్ప కళా వైభవానికి ఖ్యాతి చెందిందని ఆయన గుర్తు చేశారు. కవులు, స్వాతంత్ర్య పోరాట యోధులు , విప్లవకారులు తిరిగిన నేల ఓరుగల్లు అని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వరంగల్ తో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. గతంలో ఇక్కడ ఆర్‌ఈసీలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యాయని ఆయన మననం చేసుకొన్నారు. దేశానికి ప్రధానిని అందించిన గడ్డ ఓరుగల్లు అంటూ ఒయన కొనియాడారు. నియంతృత్వం, పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఓరుగల్లు పెట్టింది పేరన్నారు.