ఇవాళ పీఎం మోదీని కలుస్తా, ఆ రెండు విషయాలపై చర్చస్తా : కేటీఆర్

First Published Jun 27, 2018, 10:48 AM IST
Highlights

ట్వీట్టర్ ద్వారా వెల్లడించిన కేటీఆర్...

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ పీఎం మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రధానితో తెలంగాణ లో చేపట్టాల్సిన అభివృద్ది పనుల గురించి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధానిని నేడు కలవనున్నట్లు కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ లో కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని కలిసి తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రెండు ముఖ్యమైన  అంశాల గురించి చర్చించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.  

ప్రధానిని కలిసేందుకు డిల్లీకి బయలుదేరి వెళుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణం తో పాటు హైదరాబాద్ లో ఐటీఐఆర్  ఏర్పాటుపై మోదీతో చర్చించి వాటిపై ఓ హామీని పొందేలా కృషి చేస్తానని కేటీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్దికి ఎంత అవసరమో ప్రధానికి వివరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.  

Looking forward to meeting Hon’ble PM Sri Ji today to follow up on two important pending issues; Integrated steel plant at Bayyaram & ITIR in Hyderabad

— KTR (@KTRTRS) June 27, 2018

 

click me!