KTR : బీజేపీ చీఫ్ జేపీ నడ్డాపై కేటీఆర్ సెటైర్లు !

Published : May 07, 2022, 08:04 PM IST
KTR : బీజేపీ చీఫ్ జేపీ నడ్డాపై కేటీఆర్ సెటైర్లు !

సారాంశం

Telangana: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ న‌డ్డాపై తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌డ్డాపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లతో సెటైర్లు వేశారు.   

Telangana : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ న‌డ్డాపై తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌డ్డాపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లతో సెటైర్లు వేశారు. "అది ఎలా సాధ్యమవుతుంది! అతను రాజా హరిశ్చంద్రకు మొదటి బంధువు కాదా? ”అని నడ్డాపై వ‌చ్చిన అవినీతి ఆరోపణలపై క్రిశాంక్ మన్నె చేసిన ట్వీట్ క్ర‌మంలో కేటీఆర్ స్పందించారు. “ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సమయంలో నడ్డా జీ స్వయంగా 7000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, అందుకే ఆయనను కేబినెట్ మంత్రిగా తొలగించారని క్రిశాంక్ ట్వీట్ చేశారు.

నడ్డాకు కొన్ని ప్రశ్నలను సంధించిన కేటీఆర్‌.. త‌న ట్వీట్ కు ప‌లు వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను జోడించారు. “హలో నడ్డా జీ, కర్నాటక ముఖ్యమంత్రిని చేయడానికి తనను రూ. 2,500 కోట్లు లంచం ఇవ్వాలని అడిగారని మీ స్వంత బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. కాంట్రాక్టర్లు 40% కమీషన్ చెల్లించాలని చెప్పారు.. హిందూ మఠం చూసేవారు కూడా 30% కమీషన్ చెల్లించాలని అంటున్నారు! ఏ కుచ్ కెహనా హైన్? ఈడీ, ఐటీ, సీబీఐ కే లియే కోయి ఆదేశ్‌?’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’ అంటూ తన శైలిలో పంచ్ వేశారు. బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలు తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌డంతో ఈ మాట‌ల యుద్ధం మొద‌లైంది. మే 5న మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ‘ఏటీఎం’గా మారిందని, ఖర్చును పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘పాల ఆవు’గా మారిందని ఆరోపించారు. 1.2 లక్షల కోట్ల వరకు ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ ఒక్క అంగుళం భూమికి కూడా సాగునీరు అందలేదని ఆరోపించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం పథకాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం భూమాఫియాలా పనిచేస్తోందని మండిపడ్డారు.

వరంగల్‌లో నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన త‌ర్వాత‌.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత‌లు వ‌రుస‌గా పెట్టి కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్ నాయ‌కుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?