ఫ్రెంచ్ సెనేట్‌లో మంత్రి కేటీఆర్ అదిరిపోయే స్పీచ్.. తెలంగాణ ప్రగతి విధానాలు వివరించిన మంత్రి

Published : Oct 29, 2021, 08:09 PM IST
ఫ్రెంచ్ సెనేట్‌లో మంత్రి కేటీఆర్ అదిరిపోయే స్పీచ్.. తెలంగాణ ప్రగతి విధానాలు వివరించిన మంత్రి

సారాంశం

మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ సెనేట్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను చూడాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ఆయన ప్రసంగానికి సభలో విశేష ఆదరణ లభించింది.  

న్యూఢిల్లీ: France రాజధాని ప్యారిస్‌లోని French Senateలో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ తెలంగాణ Minister KTR అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. కేటీఆర్ Speechకు సభికులు కరతాళ ధ్వనులతో ప్రశంసించారు. ‘కొవిడ్ అనంతరకాలంలో ఇండో ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్‌ను రూపొందించడం’ అంనే అంశంపై ప్రతిష్టాత్మక కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను ఆయన ప్రస్తావించారు.

ఏడేళ్లుగా కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నదని కేటీఆర్ ఈ సభలో వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధికర చర్యలను వివరించారు. ఈ సందర్భంలో భారత సమాఖ్య స్ఫూర్తినీ స్పష్ట పరిచారు. జాతీయ విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి అని తెలిపారు. భారత సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాలూ భూ కేటాయింపులు, అనుమతుల ప్రక్రియ, సుశిక్షిత మానవ వనరులను అందుబాటులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. వీటితోపాటు వనరుల సేకరణ విధానాల వంటి బహుళ కార్యాచరణ అంశాలలో రాష్ట్రాలు గణనీయమైన స్వయంప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని తెలిపారు.

Also Read: తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం.. ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో మంత్రి కేటీఆర్

Telangana ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు తీసుకుంటున్నదని, ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పారిశ్రామిక వాతావరణాన్ని మంత్రి కేటీఆర్ ఈ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. తెలంగాణలో Investmentకు గల అవకాశాలను అన్వేషించాలని ఫ్రెంచ్ పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్రెంచ్ Companyలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉందన్నారు.

టీఎస్ ఐపాస్ గురించీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధ్రువీకరణను అనుమతిస్తున్నదని వివరించారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు క్లియరెన్స్ లభిస్తుందని తెలిపారు. ఈ 15 రోజుల వ్యవధిలో అనుమతులు అందకపోతే 16వ రోజు పూర్తి అనుమతులు లభించినట్టుగానే పరిగణిస్తామని వివరించారు. తెలంగాణకు టీఎస్ఐఐసీలో దాదాపు 200వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందనీ, విద్యుత్, నీరు, ఉత్తమ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

Also Read: TRS Plenary: మీరెందుకు గులాబీ చొక్కాలు వేసుకోలేదు?.. కొందరు నేతలతో కేటీఆర్

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)ను మంత్రి కేటీఆర్ హైలైట్ చేశారు. ప్రభుత్వం స్వయంగా ఔత్సాహికలకు శిక్షణ ఇచ్చి నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నదని వివరించారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఉపకరిస్తున్నదని తెలిపారు. ఏ కంపెనీ అయినా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనకుంటే, సదరు కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫర్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు ఆఫర్‌లను తమతో వివరించినా, వాటికంటే బెటర్ ఆఫర్ ఇస్తామని తెలిపారు.

మంత్రి కేటీఆర్ ప్రసంగంపై సభలో విశేష ఆదరణ లభించింది. సభికులు కరతాళ ధ్వనులతో హర్షించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధికర నిర్ణయాలను కొనియాడారు. ఈ ప్రసంగంతో ఆయన మరోసారి ప్రపంచ యవనికపై తెలంగాణ స్వరాన్ని వినిపించినట్టు అయిందని భావిస్తున్నారు. పెట్టుబడి దారులూ ఆయన ప్రసంగంపై ఆసక్తి చూపినట్టు తెలిసింది. దాని సత్ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని ఇంకొందరు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు