2019 లో టీఆర్ఎస్ లక్ష్యం అదే...సనత్ నగర్ సభలో కేటీఆర్

By Arun Kumar PFirst Published Jan 2, 2019, 9:12 PM IST
Highlights

త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యేలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లోక్ సభను మినహాయించి మిగతా 16 పార్లమెంటు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకే రావాలని అన్నారు. కేసిఆర్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తారని కేటీఆర్ అన్నారు.  కాబట్టి 2019 లో టీఆర్ెస్ లక్ష్యం ఆ 16 స్థానాల్లో గెలుపే కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 

త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యేలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లోక్ సభను మినహాయించి మిగతా 16 పార్లమెంటు సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకే రావాలని అన్నారు. కేసిఆర్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధిస్తారని కేటీఆర్ అన్నారు.  కాబట్టి 2019 లో టీఆర్ెస్ లక్ష్యం ఆ 16 స్థానాల్లో గెలుపే కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 

ఇవాళ హైదరాబాద్ లోని సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆద్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.   

గతంలో ముందస్తు ఎన్నికలకు పోయిన అన్ని పార్టీలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి...కానీ మొట్టమొదటి సారి టీఆర్ఎస్ పార్టీ ఘటనవిజయం సాధించిందని కేటీఆర్ అన్నారు. ప్రజల్లో ఉన్న ఆలోచనలను ఓటమి పాలైన పార్టీల నాయకులు పసిగట్ట లేక పోయారని...కానీ కెసిఆర్ తెలంగాణ ప్రజల మనోగతమేంటో తెలుసుకుని ముందస్తుకు వెళ్లారని అన్నారు. ఆయన ఏదీ చేసినా అది ఓ కొత్త చరిత్రే అవుతోందంటూ ప్రశంసించారు. అసెంబ్లీ రద్దు చేసిన కొన్ని గంటల్లోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి కెసిఆర్ సంచలనం సృష్టించారన్నారు. 

తెలంగాణ కోసం పార్టి పెట్టి రాష్ట్రాన్ని సాధించిన అరుదైన నాయకుడు కెసిఆర్ అని పొగిడారు. కేసిఆర్ నాయకత్వం తోనే బంగారు తెలంగాణ సాధ్యమని తెలంగాణ ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే ఈ ఘనవిజయం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సహా వివిధ పార్టీల అగ్ర నేతలందరూ కాలికి బలపం కట్టుకుని తిరిగినా తమవద్దున్న ఏకైక నాయకుడు కెసిఆర్ ముందు నిలవలేక పోయారని కేటీఆర్ తెలిపారు. 

గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీకి 14 శాతం ఓట్లు పెరిగాయి ...అసెంబ్లీ లో 75 శాతం సీట్లు సాధించామని గుర్తుచేశారు. అయితే ఇంత పెద్ద విజయం సాధించామని నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ అహంకారం రావద్దన్నారు. 

కుల ,మతాలకు అతీతంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 సీట్లుంటే మజ్లీస్ తో కలిసి 25 సీట్లు గెలిచామని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల లాంటి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమయ్యాయన్నారు. 

సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజల మనిషని కేటీఆర్ పొగిడారు. ఆయన 65 నుంచి 75 వేల మెజారిటీ తో గెలవాల్సింది ... కానీ మెజారిటీ తగ్గినందుకు తనకు వ్యక్తిగతంగా బాధ గా ఉందని అన్నారు. ఓట్ల గల్లంతు కూడా ఆయన మెజారిటీ తగ్గడానికి కారణమన్నారు. అందువల్ల ఓటర్ల నమోదును ఉధృతంగా చేపించాల్సిన అవసరం టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

తెలంగాణ ప్రజలు ఇచ్చిన బ్రహ్మాండమయిన తీర్పును వమ్ము చేయకుండా వ్యవహరిద్దామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామీని నేరవెర్చే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి టీఆర్ఎస్ ర్యకర్త కాలర్ ఎగరేసే విధంగా హామీలు నెరవేరుస్తామని పేర్కొన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.  

click me!