TRS Plenary ప్రగతి వైపు తెలంగాణ, అంతులేని వైఫల్యాలు కేంద్రానివి: కేటీఆర్ సెటైర్లు

Published : Apr 27, 2022, 04:27 PM ISTUpdated : Apr 27, 2022, 04:35 PM IST
TRS Plenary ప్రగతి వైపు తెలంగాణ, అంతులేని వైఫల్యాలు కేంద్రానివి: కేటీఆర్ సెటైర్లు

సారాంశం

తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో అద్భుతమైన అభివృద్దిపథంలో దూసుకుపోతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు.

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే కేంద్రానికి అంతులేని వైఫల్యాల చరిత్ర అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

బుధవారంనాడు హెచ్‌ఐసీసీలో నిర్వహించిన TRS Plenaryలో KTR  ప్రసంగించారు.దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలనేరాజకీయ తీర్మానంసై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రసంగించారు.

NTR, KCR  మాత్రమే తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేశారని కేటీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తే కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా సృష్టించారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ జీవితం ధన్యమైందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నాడని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ గొప్ప పాలనాధ్యక్షుడని పార్టీ నిర్వాహకుడని అరుణ్ జైట్లీ గతంలో తనతో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాాష్ట్రంలో అనుసరిస్తున్న పదద్దతులనే దేశం మొత్తం అనుసరించే పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ చెప్పారు.


Rythu Bandhuపథకం కేంద్రానికి  ప్రేరణగా నిలిచిందన్నారు. టీఎస్ ఐపాస్ లాగా కేంద్రం సింగిల్ విండో  పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు 24 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఎండిపోయిన Sriram Sagar కు జీవకళ తీసుకువచ్చిన చరిత్ర కేసీఆర్ దేనని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ విజన్ ఉన్న నేత అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.భారత్ దేశానికి అన్నం పెడుతున్న దేశాల్లో తెలంగాణ నాలుగో రాష్ట్రమని కేటీఆర్ చెప్పారు. మత పిచ్చి లేని కుల పిచ్చి లేని సంక్షేమ దిశలో ముందుకు వెళ్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ వివరించారు.

రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను తీసుకొచ్చిన చరిత్ర  నరేంద్ర మోడీదని కేటీఆర్ చెప్పారు. నరేంద్ర మోడీ రైతు విరోధి అని రైతులే అంటున్నారని కేటీఆర్ విమర్శించారు.2022 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని మోడీ ఇచ్చిన హమీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హమీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. తన కార్పోరేట్ మిత్రుల 11 లక్షల కోట్లను మాఫీ చేశారన్నారు.  ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని మోడీ అమలు చేయలేదన్నారు. LPG Gas సిలిండర్ ధర వెయ్యి రూపాయాలైందన్నారు. కట్టెల పొయ్యి దిక్కయిందన్నారు.2022  నాటికి బుల్లట్ రైలు తెస్తామన్నారు.ఇండియాకు చెందిన ఆస్తులను అమ్మేస్తున్నారని చెప్పారు.నిత్యావసరాలు మొదలు అన్నింటా ధరలను పెంచేశారన్నారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు  ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారన్నారు. డబుల్ ఇంజన్ అంటే దేశంలో ప్రజల కష్టాలు డబుల్ అయ్యాయన్నారు. గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు. కరోనా టైంలో శవాలు తేల్చారని కేటీఆర్ సెటైర్లు వేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.గాడ్సేని ఆరాధిస్తున్నవారికి పెద్దపీట వేస్తున్నారన్నారు.

గోల్ మాల్ Gujarat మోడల్ పెట్టి దేశ ప్రజల్ని Narendra Modi ఆగమాగం చేశారని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానిది అంతులేని అబద్దాల చిట్టా అంటూ కేటీఆర్ చెప్పారు. నా పేరు చెప్పి కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని కేటీఆర్ ప్రశ్నించారు.1987లో India, China ల GDP ఒక్కటేనని కేటీఆర్ చెప్పారు. కానీ ప్రస్తుం చైనాకు ఇండియాకు మధ్య చాలా తేడా ఉందన్నారు. ఇండియా జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లుంటే చైనాది 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందని కేటీఆర్ వివరించారు.ఇండియా తలసరి ఆదాయం 1800 డాలర్లుంటే చైనాది 9 వేల డాలర్లకు చేరుకుందన్నారు. మేరా భారత్ మహాన్ అనే నినాదాన్ని సాకారం చేసే నాయకుడిని భారత దేశం  కోరుతుందన్నారు. ఆ నాయకుడిని బహుశా తెలంగాణే అందిస్తుందని తాను అనుకొంటున్నానని  ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఉద్వేగాల భారత్ కాదు ఉద్యోగాల భారత్ కావాలని ప్రజలు కోరుకొంటున్నారని కేటీఆర్ చెప్పారు.

జాతీయవాదం పేరుతో జాతీయ సంపదను ప్రైవేటీకరిస్తున్నారన్నారు. భారత్ పెట్రోల్, ఇండియన్ ఆయిల్, హెచ్ పీ ఆయిల్ కంపెనీలు, ఎల్ఐసీ, విశాఖ స్టీల్ ప్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.  ఏడేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగిందన్నారు.మతపిచ్చి, కులపిచ్చి లేని సంక్షేమ దిశలో ముందుకు వెళ్తున్నామన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?