పనులు మేం చేసుకుంటే.. పొగడ్తలు ప్రకాశ్ రాజ్‌ పైనా?.. కేటీఆర్‌పై ఆ గ్రామస్తుల అసంతృప్తి

By Mahesh KFirst Published Sep 22, 2022, 12:45 PM IST
Highlights

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న రంగారెడ్డి జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో మంచి అభివృద్ధి జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ప్రకాశ్ రాజ్ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆ తర్వాత కాలంలోనే గ్రామంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. మూడేళ్లుగా సొంత నిధులతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.
 

హైదరాబాద్: గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంది మేం. నిధులు మావి. అందరం కలిసి ఊరిని డెవలప్ చేసుకుంటే.. మంత్రిగారు ప్రకాశ్ రాజ్‌ను ప్రశంసించడం భావ్యమా? స్వయంగా మా ఊరిని అభివృద్ధి చేసుకున్న మమ్మల్ని కదా పొగడాల్సింది.. అంటూ కేశంపేట గ్రామస్తులు ఆక్రోశించారు.

రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామం అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్నది. మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. రోడ్లనూ అందంగా నిర్మించుకున్నారు. ఈ ఫొటోలోను ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకాశ్ రాజ్‌ను ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో సమన్వయం చేసుకుని ఊరిని అభివృద్ధి చేశారనే అర్థంలో ట్వీట్ చేశారు.

This is the village adopted by

Great progress made in tandem with local MLA Garu 👏 https://t.co/yGfYdloaFT

— KTR (@KTRTRS)

అయితే, ఈ ట్వీట్‌ను కొండారెడ్డిపల్లి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. తమ గ్రామ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని వివరించారు. ఆ తర్వాత తమ గ్రామాన్ని సొంత నిధులతో స్వయంగా తామే అభివృద్ధి చేసుకున్నామని, తర్వాతి కాలంలోనే గ్రామంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందని కొండారెడ్డిపల్లి సర్పంచ్ పల్లె స్వాతి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి స్పష్టం చేశారు.

మూడేళ్లుగా సొంత నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్న తమను ప్రోత్సహించకుండా ప్రకాశ్ రాజ్‌పై పొగడ్తలు కురిపించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి కోసం తాము పనులు చేసుకంటే.. ప్రకాశ్ రాజ్‌పై పొగడ్తలు కురిపిస్తారా? అంటూ ప్రశ్నించారు.

click me!