బతుకమ్మ పాటను విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Published : Sep 22, 2022, 12:25 PM IST
బతుకమ్మ పాటను విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సారాంశం

తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలయ్యింది. ఈ నేపథ్యంలో జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందం రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సందర్భంగా "సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో" అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు.  

ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ మూజీబ్, హాజ్ కమిటీ చైర్మన్ సలీం, టియస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!