రాహుల్, చంద్రబాబుపై కేటీఆర్..టూరిస్ట్ సెటైర్

By ramya neerukondaFirst Published Nov 29, 2018, 12:25 PM IST
Highlights

మహాకూటమి అధికారంలోకి వస్తే.. తెలంగాణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో.. ఒక్క ఫోటోతో ప్రజలను చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్. 

ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ టూరిస్ట్ ల సీజన్ నడుస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబులు ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. 

కాగా.. వీరి పర్యటనలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పొలిటికల్ సెటైర్ వేశారు.  దేశంలోనే గొప్ప రాజకీయ న్యాయకత్వాన్ని తాము కలిగి ఉన్నామని చెప్పిన కేటీఆర్.. తమ ప్రత్యర్థులను టూరిస్ట్ లుగా అభివర్ణించారు.మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబులు టూరిస్టులు లాంటి వారని.. వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారని చెప్పుకొచ్చారు. 

అంతేకాకుండా.. మహాకూటమి అధికారంలోకి వస్తే.. తెలంగాణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో.. ఒక్క ఫోటోతో ప్రజలను చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఒక ఫోటోలో రాహుల్, చంద్రబాబు కూర్చొని ఉంటే.. ఉత్తమ్ వారి దగ్గర నిల్చొని ఉన్నాడు.

ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన  కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వెన్నుముక, ఆత్మాభిమానం లేవని కామెంట్ చేశాడు. తెలంగాణ ప్రజలు కూటమిని గెలిపిస్తే మళ్ళి ఢిల్లీ,అమరావతి చేరలో బానిసలుగా మారతారంటూ.. పరోక్షంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 

 

Future of Telangana if the Maha Ghatiya Bandhan is voted👇

Spineless & subservient Telangana Scamgress men should be ashamed of themselves. Zero self respect 👎 pic.twitter.com/GKJfVb7OQW

— KTR (@KTRTRS)


 

click me!