ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ బహిరంగ సభ... ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్

Published : Nov 26, 2020, 02:04 PM IST
ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ బహిరంగ సభ... ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్

సారాంశం

ఈ రోజు ఉదయం  సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. కాగా.. ఈ సభలో కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, ఆలోచనలను ఆయన ప్రజలతో పంచుకోనున్నారు

ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ బహరింగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, పార్టీ నాయకులు పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సభ నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ నెల 28న  సాయంత్రం 4గంటలకు జరగనుంది.

ఈ రోజు ఉదయం  సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. కాగా.. ఈ సభలో కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, ఆలోచనలను ఆయన ప్రజలతో పంచుకోనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేశారు. 

నగర ప్రజలకు తాగునీటి సరఫరాను ఉచితంగా అందించనున్నట్లు ఇప్పటికే మెనిఫెస్టోలో తెలియజేశారు. కాగా.. ఈ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు నగర ప్రజలను కోరుతున్నారు. ఈ సభకు ప్రజలు భారీగా తరలివస్తారని తమకు నమ్మకం ఉందని వారు చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు