ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం: బిజెపి ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ఫడ్నవీస్

By telugu teamFirst Published Nov 26, 2020, 1:09 PM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిెజెపి మానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ఫడ్నవీస్ చెప్పారు.

హైదరాబాద్:  జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి ఎన్నికల ప్రణాళికను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదలర చేశారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విషయాలను ఆయన మీడియా సమావెశంలో వివరించారు. ప్రజల ఆకాంక్షల మేరకు మానిఫెస్టోను రూపొందించినట్లు ఆయన తెలిపారు. 

ప్రజలపై భారం వేసే ఎల్ఆర్సీని రద్దు చేస్తామని ఆయన చెప్పారు. బడి పిల్లలకు ట్యాబ్ లు, వాటికి ఉచిత వైఫైని ఇస్తామని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు. 125 గజాల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి ఉచితంగా అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు 

హైదరాబాదు వరద బాధితులకు రూ.25వేల చొప్పున సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ జెండాను ఆవిష్కరిస్తామని ాయన చెప్పారు. హైదరాబాదులోని అక్రమ ఆక్రమణలను తొలగిస్తామని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. 

దేశంలోని అద్భుతమైన నగరాల్లో హైదరాబాదు ఒక్కటని ఆయన అన్నారు. ప్రజల నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రణాళిక విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ తదితురులు పాల్గొన్నారు.  

జంటనగరాలవాసులకు ఉచిత నీటి సరఫరా కల్పిస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అదే విధంగా రూ.10 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపింది. మెట్రో రైల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మానిఫెస్టోలో హామీ ఇచ్చారు.

హైదరాబాదులో రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం ఉందని, త్వరలో కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు.

click me!