కేటీఆర్ కు ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తే అధికారకంగా అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
నిన్న మొన్నటి వరకు కెటిఆర్ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగినా... కేటీఆర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం మొదలైంది.దాదాపు ఆరు నెలలుగా కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం జోరుగా జరిగింది. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అధికార పార్టీలో చర్చ మొదలైంది.
కేటీఆర్ కు ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగిస్తే అధికారకంగా అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పరిపాలన కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగే విధంగానే ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయని నేతలు అంటున్నారు.
undefined
ఒకేసారి భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరుగడనికి ఇదే కారణమన్న వాదన ఉంది. త్వరలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా కేటీఆర్ ఆమోదంతో జరగనున్నాయని తెలుస్తోంది.
రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం అయినట్లు అధికార వర్గాలు అంటున్నాయి.కేటీఆర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే......పార్టీలో, ప్రభుత్వం లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుండదని అభిప్రాయం వ్యక్తం అవుటింది.
సహకార ఎన్నికలు పూర్తయ్యే లోపు పాలనా యంత్రంగంలో సమూల మార్పులు చేసి....పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.