
హైదరాబాద్: మతం పేరుతో చిచ్చు పెడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR చెప్పారు. మంగళవారం నాడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల‌్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. మతం, కులం పేరుతో రాజకీయాలును చేసే వారిని ఒ కంట కనిపెట్టాలని మంత్రి ప్రజలను కోరారు.
తాను చదువుకొనే రోజుల్లో వారానికి రెండు మూడు రోజులు Curfew ఉండేదన్నారు.తెTelangana ఏర్పడ్డాక ప్రశాంతంగా ఉందన్నారు. పనికిమాలిన పంచాయతీలు లేవన్నారు.. కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కులాలు, మతాల చిచ్చులో చలిమంటలు కాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని తెలిపారు. తాము నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. న్యూ సిటీకి సమాంతరంగా ఓల్డ్ సిటీని కూడా అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.. గతంలో మోజాం జాహీ మార్కెట్‌ను చూసి బాధపడేవాళ్లం. ఇప్పుడు మోజాం జాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేశామన్నారు. కులీకుత్‌బ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.. వారసత్వ సంపదను కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఏ ఎన్నికలు లేకపోయినా రూ. 495 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలు ఉన్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం తాగునీరు, విద్యుత్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీలో అవసరమైన చోట రోడ్లను విస్తరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైద్రాబాద్ లో పాతబస్తీ, న్యూ సిటీలో నోటరీ సమస్యను పరిష్కరించనున్నామన్నారు. ఇందుకు గాను 58, 59 జీవోలను జారీ చేసినట్టుగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.ఉస్మానియా ఆసుపత్రిని కూడా డెవలప్ చేస్తామన్నారు. ఈ ఆసుపత్రి, నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.