
భదాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కుల బహిష్కరణ చేస్తామని ఊరి పెద్దలు బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కృష్ణ.. తాను నివాసం ఉండే విధీలోనే ఉంటున్న మానసిక వికలాంగురాలిపై అతడు అత్యాచారం చేశాడు. ఆమె బహిర్భూమికి వెళ్లడం గమనించిన కృష్ణ.. ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బహిర్భూమికి వెళ్లిన కూతురు ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో వెతుకుతూ వెళ్లారు. అక్కడ ఒంటి మీద రక్తపు మరకలతో కూతురిని చూసి షాక్ అయ్యారు. అయితే ఈ ఘటనపై ఉరిలోని పెద్దలకు చెప్పగా.. వారు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌ను వెళ్లి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. అయితే తమది గిరిజన గ్రామం కావడంతో పంచాయితీలను ఊరిలోనే పరిష్కరించుకుంటామని పెద్దలు చెబుతున్నారు.
కేసును విత్ డ్రా చేసుకోకపోతే.. కుల బహిష్కరణ చేస్తానమి బాధితురాలి కుటుంబంపై ఊరి పెద్దలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితులకు ఊరి పెద్దల అండగా నిలిస్తున్న తీరుపై కొందరు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
మరోవైపు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా అత్యాచార ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది.