నేరాల అదుపునకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి: కేటీఆర్

Published : Nov 11, 2020, 01:27 PM IST
నేరాల అదుపునకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి: కేటీఆర్

సారాంశం

పబ్లిక్ సేప్టీ ఇంటిగ్రేటేడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్ ను హైద్రాబాద్ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్,  సబితా ఇంద్రారెడ్డిలు బుధవారం నాడు ప్రారంభించారు. దీని ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 5 వేల సీసీ కెమెరాల ను ఒకేసారి వీక్షించే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్: పబ్లిక్ సేప్టీ ఇంటిగ్రేటేడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్ ను హైద్రాబాద్ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్,  సబితా ఇంద్రారెడ్డిలు బుధవారం నాడు ప్రారంభించారు. దీని ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 5 వేల సీసీ కెమెరాల ను ఒకేసారి వీక్షించే అవకాశం ఉంటుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నేరాలను అరికట్టేందుకు గాను టెక్నాలజీని ఉపయోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

రాష్ట్రంలో పోలీస్ శాఖ తీసుకొంటున్న చర్యలతో  నేరాల సంఖ్య తగ్గుతోందన్నారు.అయితే అదే సమయంలో  సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన చెప్పారు.ఈ విషయమై జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. షీ టీమ్స్ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ విషయమై 

గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ హైద్రాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.  హైద్రాబాద్ ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలనేది అందరి లక్ష్యమని ఆయన చెప్పారు.

సీఎం కేసీఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు రూపకల్పన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.హైద్రాబాద్ నగరంలో మొత్తం లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా ఆయన చెప్పారు. ఈ కెమెరాలు పారదర్శకంగా పనిచేస్తాయన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్