ఆర్మూర్ లో కెటిఆర్ కు అరుదైన ప్రశంసలు

First Published Apr 6, 2017, 8:47 AM IST
Highlights

పెద్దాయన ముఖ్యమంత్రి  రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తుంటే  మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికల అమలులో ముందుకు పోదాం- డి. శ్రీనివాస్

ఈ రోజు  నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ లోజరిగిన జనహిత ప్రగతి సభలో తెలంగాణా ఐటి మంత్రి కె తారక రామారావు  ప్రత్యేక ఆకర్షణ. ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ని తలపించారు. ఆయన మీద ప్రశంసలు జల్లు గా మొదలయి జడివాన గా మారాయి. మాజీ పిసిసి అధ్యక్షుడు,ప్రస్తుతం  రాభ్య సభ సభ్యుడయిన డి శ్రీనివాస్   విపరీతంగా కెటిఆర్ ను, ఆయన పని తీరు ను ప్రశసించారు.

 

పెద్దాయన ముఖ్యమంత్రి  కెసిఆర్ రాష్ర్టాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తుంటే  మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికల అమలులో ముందుకు పోదామన్నారు. ‘మంత్రి కేటీఆర్‌కు నా ఆశీస్సులుంటాయి.. తండ్రి అడుగుజాడల్లో యువనేత కేటీఆర్ దూసుకెళ్తున్నారు. కేటీఆర్‌కు ఉజ్వల భవిష్యత్ కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను,‘ అన్నారు.

 

ఆయన ఇంకా ముందుకెళ్లి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన పిల్లల్ని అద్బుతంగా తీర్చి దిద్దారని డిఎస్ కొనియాడారు. నిజాంబాద్ ఎంపీ కవిత ను కూడా ఆయన ప్రశసించారు. ఆమె చిన్న వయస్సులోనే తెలంగాణ జాగృతిని స్థాపించి దానిని విశ్వవ్యాపితం  చేశారని  అన్నారు.

 

 తర్వాత  కవిత మాట్లాడుతూ కే‘టీఆర్ నాకే కాదు, తెలంగాణ ఆడ బిడ్డలందరికీ సోదరుడు,’ అని అన్నారు.  ‘రామన్న మన అందరికి అన్న. రామన్న మన అందరి కష్టాలను తీర్చుతారు. రామన్న వంటి  ఆత్మీయ సోదరుడు ఉన్నందుకు నేను గర్విస్తున్నాను,’ అని ఆమె అన్నారు.

 

అంతకు ముందు ఆర్మూర్ ఆరంభంనుంచి సభ దాకా పెద్ద వూరేగింపుతో కెటిఆర్ తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రజలు,ముఖ్యంగా మహిళలు సభకు తరలివచ్చారు.

 

సాధారణంగా ఇలాంటి గౌరవం  ముఖ్యమంత్రికే జరుగుతుంది. కెటిఆర్ పార్టీకి వర్కింగ్ అధ్యక్షుడవుతాడనే నేపథ్యంలో, పార్టీ 2019లో ఆయన నాయకత్వంలోనే ఎన్నికలలోతలపడుతుందన్న వూహాగానాల మధ్య కెటిఆర్  ఈ ప్రశంసలందుకున్నారు. సభలోవేదిక మీద ఉన్నవారంతా కెటిఆర్ ను  ముఖ్యమంత్రిగానే చూశారు. వేదిక మీద జిల్లాకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, టిఆర్ ఎస్ నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే పార్టీ ప్లీనరీ లో కెటిఆర్ కు పెద్ద  పార్టీ బాధ్యత అప్పగిస్తున్న తరుణంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

click me!