గిఫ్ట్ ఏ స్మైల్: దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేసిన కేటీఆర్

Published : Aug 08, 2021, 04:22 PM IST
గిఫ్ట్ ఏ స్మైల్: దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేసిన కేటీఆర్

సారాంశం

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ ఇవాళ  మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


హైదరాబాద్:తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిసారి ఏదో ఒక సేవా కార్యక్రమాలకు పూనుకుంటున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.ఆదివారం నాడు నెక్లెస్ రోడ్ లో దివ్యాంగులకు మంత్రి కేటీఆర్  గిఫ్ట్ ఏ స్మెల్ కింద  దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  తన పుట్టిన రోజున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాట చేసి డబ్బులను వృధా చేయవద్దన్నారు. 

రాజకీయాల్లో ఉన్నవారంతా అనవసరంగా డబ్బును వృధా చేసేవారు కూడ ఉన్నారన్నారు. గత ఏడాది సిరిసిల్లలో  ఆరు అంబులెన్స్ లను అందించారు. ఇవాళ మంత్రి దయాకర్ రావు 150, ఎమ్మెల్యే కృష్ణారావు 100, ఎమ్మెల్సీ లుశంభీపూర్ రాజు 63, నవీన్ 100, ఎమ్మెల్యే వివేకానంద 50  వాహనాలను దివ్యాంగులకు అందించారు.తన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.
మంగ‌ళ‌సూత్రం తీయ‌మ‌న్న‌ప్పుడు ఏడ్చేశా, ఆ ఫుడ్ చూసి వాంతి వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌