ఏపీలో టీఆర్ఎస్ పార్టీనా..?

By ramya neerukondaFirst Published Sep 5, 2018, 3:21 PM IST
Highlights

చాలామంది ఆంధ్రా ప్రజలు ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టమని కోరుతున్నారని కేటీఆర్ చెప్పారు.
 

పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలన్నింటికీ ఇప్పుడు తెలంగాణ ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు. చాలామంది ఆంధ్రా ప్రజలు ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టమని కోరుతున్నారని కేటీఆర్ చెప్పారు.

బుధవారం షాద్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ భవిష్యత్తులో మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా ముందుకెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. కులవృత్తుల కోసం రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

తన ఇంట్లో మనవలు ఏ బియ్యం తింటున్నారో.. అదే బియ్యం సాధారణ విద్యార్థులు కూడా తినాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో వసతిగృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారికి ఒక్కో వ్యక్తికి గతంలో 4 కిలోల బియ్యం ఇస్తే.. ఇప్పుడు దానిని 6 కిలోలకు పెంచినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్య అందిస్తున్నామన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కతుందన్నారు.

click me!