ఇక తెలంగాణలో జిట్టా, రాణిరుద్రమల రాజకీయ పార్టీ

Published : Sep 05, 2018, 02:51 PM ISTUpdated : Sep 09, 2018, 12:25 PM IST
ఇక తెలంగాణలో జిట్టా, రాణిరుద్రమల రాజకీయ పార్టీ

సారాంశం

తెలంగాణలో  ముందస్తు ఎన్నికలకు కసరత్తులు ఊపందుకున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అందుకు సిద్దమవుతున్నాయి. ఇక ఇదే అదునుగా భావించి ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు పోటీగా మరిన్ని పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఇవాళ ఓ కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. "యువ తెలంగాణ"  పార్టీ పేరుతో ఈ కొత్త రాజకీయ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీకి దిగడానికి సిద్దమైంది.

ఈ యువ తెలంగాణ పార్టీని జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ కలిసి స్థాపించారు. ఈ పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ... యువత, మహిళలకు రాజకీయ అవకాశాన్ని కల్పించడమే తమ పార్టీ ద్యేయమని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వంలో మహిళకు, యువతకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదంటూ విమర్శించారు. అసలు కేబినెట్ లోకి ఒక్క మహిళా మంత్రిని కూడా తీసుకోకుండా వారిని  అవమానించారన్నారు. 

తమ యువ తెలంగాణ పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. అందుకోసమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాణి రుద్రమను నియమించినట్లు తెలిపారు. పార్టీ కమిటీలో కూడా మహిళలకు స్థానం కల్పించినట్లు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు.

అనంతరం యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ మాట్లాడుతూ...ఈ పార్టీ ఆవిర్భావం తెలంగాణలో చేపట్టిన ఓ అద్భుత ప్రయోగమని అన్నారు. అన్ని విషయాల్లో మహిళలు సమానమనే పార్టీలు రాజకీయాలకు వచ్చే సరికి వారిపై చిన్న చూపు చూపిస్తారని అన్నారు. అందువల్లే తమ పార్టీ పోటీ చేసే ప్రతి ఎన్నికల్లో మహిళలకు 40 శాతంకు తగ్గకుండా సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇలా మహిళా అభ్యున్నతికి కోసం యువ తెలంగాణ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని రాషి రుద్రమ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ