చైతన్యపురి ఎస్సైపై సస్పెన్షన్ వేటు...

Published : Mar 01, 2019, 02:35 PM IST
చైతన్యపురి ఎస్సైపై సస్పెన్షన్ వేటు...

సారాంశం

ఓ ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్సైపై వేటు పడింది. సదరు ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు రాచకొండ కమీషనరేట్ నుండి ఓ ప్రకటన వెలువడింది. 

ఓ ఆత్మహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్సైపై వేటు పడింది. సదరు ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు రాచకొండ కమీషనరేట్ నుండి ఓ ప్రకటన వెలువడింది. 

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చైతన్యపురిలో నివసించే వెంకటేశ్ అనే వ్యక్తి ఓ వ్యాపారి వద్ద చిట్టీ(నెలవారిగా నగదు జమ చేయడం) వేశాడు. అయితే మధ్యలో ఈ చీట్టీ లేపుకుని వాయిదా డబ్బులను సరిగ్గా కట్టడంలేదు. దీంతో చిట్టీల వ్యాపారి డబ్బుల కోసం వెంకటేశ్ ను గట్టిగా బెదిరించాడు. అంతేకాకుండా అతన్ని నిత్యం వేధించసాగాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో స్థానిక ఎస్సై నాగార్జున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఉన్నతాధికారు దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలో ఎస్సై వ్యవహారంపై విచారణ జరపగా నిజమని తేలడంలో రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ అతన్ని సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించి కమీషనర్ కార్యాలయయం శుక్రవారం ఓ ప్రకటన చేసింది.  
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!