ఫారెన్ లో కేటిఆర్ ఏం చేస్తున్నారో తెలుసా ?

Published : Jan 16, 2018, 08:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఫారెన్ లో కేటిఆర్ ఏం చేస్తున్నారో తెలుసా ?

సారాంశం

దక్షిణ కొరియాలో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బృందం పర్యటన తెలంగాణకు పెట్టుబడుల కోసం సమావేశాలు టెక్ట్ టైల్స్ పరిశ్రమల సియివోలు, చైర్మన్లతో సియోల్ నగరంలో సమావేశం కాకతీయ టెక్ట్స్టైల్ పార్కులో పెట్టబడులు పెట్టాలని కోరిన మంత్రి బృందం హ్యూందయ్ సంస్థతో సమావేశం, అటోమోబైల్ పెట్టుబడులకు అహ్వనం కొరియా మోబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్ తో తెలంగాణ ప్రభుత్వ యంవోయు

రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బృందం పలు కంపెనీల సియివోలు, కంపెనీల ప్రతినిధుల సమావేశాలతో బిజీ జిజీగా గడిపారు. వివిద కంపెనీలను కలిసిన మంత్రి బృందం తెలంగాణ రాష్ర్టంలో ఉన్న వ్యాపార, పెట్టబడులు అవకాశాలను వివరించారు. ముఖ్యంగా అటోమోబైల్, టెక్స్టైల్స్, ఫార్మ, ఐటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. అటోమోబైల్  దిగ్గజం హ్యూందయ్ కార్పోరేషన్ కార్యనిర్వాహాక ఉపాద్యక్షులు నామ్ గుహ్నోతో(Nam Geunho) సమావేశం అయ్యారు. తెలంగాణలోని అటోమోబైల్ రంగంలో ఉన్న పెట్టబడుల ఆవకాశాలను వివరించారు. ముఖ్యంగా టియస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతుల విధానం పైన హ్యూందయ్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. హ్యూందయ్ రోటెమ్, గ్లోబల్ రైల్వే విభాగం డైరెక్టర్ కెకె యూన్ తో సమావేశం అయ్యారు. గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఉన్న ఒసిఐ సియివో WooHyun Lee తో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ముప్పయ్ మూడు ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీని తెలంగాణకు అహ్వానించారు.

మోబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్ (మెయిబా)తో మంత్రి ప్రతినిధి బృందం సమావేశం అయింది. మెయిబా  సియివో Choi Dong Jin తో జరిగిన సమావేశంలో సంస్ధ ప్రతినిధులను ఫిబ్రవరిలో తెలంగాణలో జరగనున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ కు అహ్వానించారు. 500లకుపైగా కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంస్ధతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు MOIBA (Korea Mobile Internet Business Association) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇంటర్నెట్ అఫ్ తింగ్స్, వర్చువల్ రియాలిటీ , మరియు ఎలక్ర్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి అంశాల్లో కలిసి పనిచేస్తాయి.

మంత్రి కెటి రామరావు టెక్స్ టైల్ పరిశ్రమల వర్గాలతో సమావేశం అయ్యారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, టెక్స్టైల్ రంగంలోని పెట్టుబడులకు అకర్షణీయ  ప్రదేశమని, పెట్టబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాకారం అందిస్తుందన్నారు.  తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టియస్ ఐపాస్ వంటి ముఖ్యాంశాలను మంత్రి వారికి వివరించారు. ముఖ్యంగా  టెక్స్టైల్ పరిశ్రమల సమాఖ్య కోఫోతి( KOFOTI) చైర్మన్ కిహూక్ సుంగ్ మరియు ఇతర కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కిహుక్ చైర్మన్ గా ఉన్న  యంగ్వాన్ సంస్ధ ఇప్పటికే కాకతీయ టెక్స్టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. యంగ్వాన్ సంస్ధ నార్త్ ఫేస్ అనే బ్రాండ్ పేరుతో వస్త్రాలను తయారు చేస్తుంది. ఈ బ్రాండ్ రానున్న ఒలిఫింక్స్ క్రీడలకు అధికారిక భాగస్వామిగా ఉన్నది. మంత్రి మరో ప్రముఖ టెక్స్టైల్ సంస్ధ హ్యోసంగ్ సంస్ద ఉపాధ్యక్షులు జె జూంగ్ లీతో సమావేశమయ్యి టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి పెట్టాలని కోరారు. ఈ సమావేశానంతరం మంత్రి డైటెక్ (Korea Dyeing & Finishing Tech Institute (DYETEC) ప్రతినిధులతో సమావేశం అయ్యారు. డైటెక్ అధ్యక్షులు Mr Yoon Nam sikతో సమావేశం అయిన మంత్రి మెగా టెక్స్ టైల్ పార్కులో వాటర్ ట్రీట్ మెంట్, మానవ వనరుల నిర్వహాణ వంటి అంశాల్లో సాంకేతిక సహకారమందించాల్సిందిగా కోరారు. డైటెక్ పరిశ్రమలో మంత్రి బృందం పర్యటించింది.  మరోక ప్రముఖ టెక్స్టైల్ దిగ్గజ సంస్ధ కోలాన్ గ్రూపుతో  మంత్రి సమావేశం అయ్యారు.

కొరియా టెక్స్టైల్ సిటీ పేరుగాంచిన దైగు మెట్రోపాలిటన్ ( Daegu) నగరాన్ని మంత్రి ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ నగరంలో కొరియన్ టెక్స్టైల్ , ఫ్యాషన్ మరియు హై టెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నది. ఈ నగర డిప్యూటీ మేయర్ కిమ్ యాన్ చాంగ్ తో సమావేశం అయిన మంత్రి నగరంలో టెక్స్టైల్ పరిశ్రమల పారిశ్రామిక ప్రగతి పైన చర్చించారు. దైగు నగర ఇన్నోవేషన్ మరియు అర్దిక విభాగ బృందంతో సమావేశం అయిన మంత్రి వారిని ఇమేజీ టవర్ ప్రాజెక్టులో భాగస్వాములు  కోరారు.  మంత్రి కెటి రామారావు వెంట తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ యంపి జి. వివేక్ తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష రంజన్ ఇతర అధికారులున్నారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu