వరంగల్ కు తెలంగాణ సర్కారు వరాల మూట

Published : Oct 20, 2017, 06:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
వరంగల్ కు తెలంగాణ సర్కారు వరాల మూట

సారాంశం

దేశ టెక్స్ టైల్ రంగానికి తలమానికంగా కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు- మంత్రి కెటి రామారావు   ఈ నెల 22న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు శంకుస్థాపన మెదటి దశలో 12 వందల ఎకరాలు, మెత్తంగా 2000 వేల ఎకరాల్లో పార్కు ఫైబర్ టూ ఫ్యాబ్రిక్ పద్దతిలో (నూలు పోగు నుంచి బట్టల తయారీ వరకు) కావల్సిన అన్ని అధునాతన వసతులు  అత్యుత్తమ టెస్టింగ్ ల్యాబోరేటరీలతోపాటు పార్కు మెత్తం జీరో లిక్విడ్ డిచార్జీ విధానం అమలు దక్షిణ కోరియకు చెందిన యాంగ్వాన్ కంపెనీ సూమారు 1000 వేయికోట్ల పెట్టుబడి ప్రత్యేక్షంగా 22 వేల మందికి, పరోక్షంగా మరో 44 వేల మందికి మెత్తంగా సూమారు 66 వేల మందికి ఉపాధి దారం కండె, కాకతీయ శిలా తొరణంల మాదిరి అకట్టుకునేలా ఫైలాన్, లోగోల డిజైన్

దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.  కాకతీయ మెగా టెక్స్టైల్స్  పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ పార్కు అవుతుందని మంత్రి తెలిపారు. గ్రామీణ వరంగల్ జిల్లా, శాయంపేట, చింతపల్లి గ్రామాల పరిధిలో మెత్తం 2000 వేల ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

ఫైబర్ టూ ఫ్యాషన్ పద్దతిలో (నూలు పోగు నుంచి బట్టల తయారీ వరకు) కావల్సిన అన్ని అధునాతన వసతులను  ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి  కెటి రామరావు తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన పత్తి దిగుబడి అయ్యే ప్రాంతాలకు చేరువుగా ఈపార్కు ఉందన్నారు.  ఇక్కడ ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్స్ పరిశ్రమలు ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో ఏర్పడనున్నాయన్నారు. ఈ పార్కులో దుస్తుల తయారీకి అవసరం అయిన ‘ప్లగ్ అండ్ ప్లే ప్యాక్టరీ’ షెడ్డులను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ టెస్టింగ్ ల్యాబోరేటరీలతోపాటు పార్కు మెత్తం జీరో లిక్విడ్ డిచార్జీ విధానం అమలు అవుతుందన్నారు. దీంతో కాలుష్య సమస్య అధికంగా ఉండదని తెలిపారు. సమీప భవిష్యత్తులో ఔటర్ రింగు రోడ్డుతోపాటు ఒక ఎయిర్ స్ట్రిప్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ పార్కు ఏర్పాటు ఉద్యోగ ఉపాది అవకాశాల కల్పనలో ఒక ముందడుగని తెలిపారు. దీంతోపాటు టెక్స్టైల్స్ పరిశ్రమలో తెలంగాణకున్న  సంప్రదాయిక నైపుణ్యాలకు అధునిక సాంకేతిక సొబగులు అద్దడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచినట్టువుతుందని తెలిపారు.   

ఇప్పటికే  దేశ, విదేశాల నుంచి  పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే 12 కంపెనీలు, 3000 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు  ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. దక్షిణ కోరియాకు చెందిన యాంగ్వాన్ కంపెనీ సూమారు 1000 వేయికోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది. దీంతోపాటు సూర్య వంశీ, శ్రీనాద్, సూర్యోదయ్ స్పిన్నింగ్ మిల్స్, శివాని గ్రూప్, గిన్ని ఫిలామెంట్స్, స్వయంవర్ గ్రూప్, వెల్ స్పన్ గ్రూప్, గోకుల్ దాస్ ఇమేజేస్, నందన్ డెనీమ్, షాపర్స్ స్టాప్, చిరిపాల్ వంటి పలు కంపెనీలు తొలిరోజు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా ప్రత్యేక్షంగా 22 వేల మందికి, పరోక్షంగా మరో 44 వేల మందికి మెత్తంగా సూమారు 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. పార్కుకు అనుబంధంగా తెలంగాణలోనే ఇతర ప్రాంతాల్లోనూ సూమారు 400 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు మరో 8 కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు.

అకట్టుకునేలా ఫైలాన్, లోగోల డిజైన్-

కాకాతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు లోగో, పైలాన్లను కూడా అకట్టుకునేలా టియస్ ఐఐసి తయారు చేసింది. టెక్స్ టైల్ పరిశ్రమ ఉన్నతి, తెలంగాణ స్పూర్తిని చాటేలా తయారు ఫైలాన్ ను తాయరు చేశారు. పరిశ్రమకు ప్రాణమైన దారపుకండె మద్యలో ఉంచి దాని చుట్టూ నిలువెత్తు రంగు రంగుల దారాల పోగుల మాదిరి డిజైన్లతో ఏర్పాటు చేసిన ఫైలాన్ అకర్షనీయంగా ఉన్నది. పార్కుకున్న అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలను సూచించేలా ఫైలాన్ పైన గ్లోబ్ ఏర్పాటు చేశారు. లోగో కాకతీయ తోరణం మాదిరి ఏర్పాటు దారాల అల్లికతో తయారు చేశారు.

 

మహిళలను వేధిస్తున్న హైదరాబాద్ జర్నలిస్టు వీడియోతోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/hMBFkQ

PREV
click me!

Recommended Stories

డియర్ పేరెంట్స్.. 'సామాన్లు' కామెంట్స్ కాదు సమస్య.. మీ పిల్లలకు అసలు సమస్య ఇదే..!
IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త