కేసీఆర్ దీపావళి కానుక: ఆస్తిపన్నులో భారీ రాయితీ, కెటిఆర్ ప్రకటన

By telugu teamFirst Published Nov 14, 2020, 1:50 PM IST
Highlights

హైదరాబాద్, పట్టణాల ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ దీపావళి కానుకను ఇచ్చారు. హైదరాబాదులోని, పట్టణాల్లోని ప్రజలకు ఆస్తి పన్నులో భారీ రాయితీ కల్పిస్తూ కేటీఆర్ ప్రకటన చేశారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు, పట్టణాల ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి కానుక ఇచ్చారు. ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ కేటీఆర్ ఆ ప్రకటన చేశారు. 

రూ.15 వేల ఆస్తి పన్ను చెల్లించినవారికి 2020-21లో యాభై శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణాల్లో రూ.15వేలు చెల్లించినవారికి ఆస్తిపన్నులో యాభై శాతం రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు. ఈ రాయితీ వల్ల 40 పట్టణాల ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆయన చెప్పారు.

ఈ రాయితీ వల్ల ప్రభుత్వ ఖజానాపై 196.48కోట్ల భారం పడుతుందని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 13 లక్షల 72 వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ వర్కర్ల వేతనాన్ని 14,500 రూపాయల నుంచి 17500 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా కేటీఆర్ తెలిపారు.  

కరోనా వల్ల చాలా నష్టపోయామని ఆయన అన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబుడుతోందని ఆయన అన్నారు. దీపావళి కానుకగా కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు వరద సాయం అందనివారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. వరద సాయం అందనివారు ఈ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. 

కరోనా మహమ్మారి కారణంగా అనేక రంగాలు తీవ్ర సంక్షోభంలో కి నెట్టబడ్డాయని మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కేటరింగ్ అసోసియేషన్ సభ్యులు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ లను కలిసి వివిధ ఫంక్షన్ లలో  కేటరింగ్ నిర్వహించుకునేలా ప్రభుత్వం అనుమతించడం పట్ల  ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ  కరోనా ఇంకా తగ్గలేదని, తగు జాగ్రత్తలు పాటిస్తూ   కేటరింగ్ నిర్వహించుకోవాలని సూచించారు.

click me!