కరోనా వైరస్ వ్యాప్తి: తెలంగాణలో కొత్తగా 1050 పాజిటివ్ కేసులు నమోదు

Published : Nov 14, 2020, 09:49 AM IST
కరోనా వైరస్ వ్యాప్తి: తెలంగాణలో కొత్తగా 1050 పాజిటివ్ కేసులు నమోదు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. తాజాగా వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులోనూ అదే స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1,050 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా ఆ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 56 వేల 713కు చేరుకుంది. 

ఆ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం ఒక్క రోజులో కరోనాతో నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,401కి చేరుకుంది. 

కరోనా వైరస్ నుంచి శుక్రవారం 1,736 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2 లక్ష 38 వేల 908కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 16,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 13,867 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 48 లక్షల 53 వేల 169 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

ఆదిలాబాద్ 10
భద్రాద్రి కొత్తగూడెం 47
జిహెచ్ఎంసీ 232
జగిత్యాల 21
జనగామ 14
జయశంకర్ భూపాలపల్లి 16
జోగులాంబ గద్వాల 7
కామారెడ్డి 13
కరీంనగర్ 49
ఖమ్మం 61
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 12
మహబూబాబాద్ 21
మంచిర్యాల 23
మెదక్ 9
మేడ్చెల్ మల్కాజిగిరి 90
ములుగు 16
నాగర్ కర్నూలు 13
నల్లగొండ 65
నారాయణపేట 3
నిర్మల్ 11
నిజామాబాద్ 14
పెద్దపల్లి 24
రాజన్న సిరిసిల్ల 21
రంగారెడ్డి 75
సంగారెడ్డి 29
సిద్ధిపేట 36
సూర్యాపేట 17
వికారాబాద్ 18
వనపర్తి  11
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 41
యాదాద్రి భువనగిరి 17

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu