Korutla: తాగడానికి అప్పు ఇవ్వలేదని.. పక్కింటి వ్యక్తి గొంతు కోశాడు! 

Published : Jan 12, 2024, 11:08 PM IST
Korutla: తాగడానికి అప్పు ఇవ్వలేదని.. పక్కింటి వ్యక్తి గొంతు కోశాడు! 

సారాంశం

Korutla: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి విచక్షణ మరిచిపోయాడు. అప్పు ఇవ్వనని చెప్పిన పాపానికి బ్లేడుతో పొరుగింటి వ్యక్తి గొంతు కోశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటు చేసుకుంది. 

Korutla: ఓ వ్యక్తి మద్యంలో విచక్షణ మరిచిపోయాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని పొరుగింటి వ్యక్తితో ఘర్షణకు దిగాడు. ఆ ఘర్షణ తీవ్ర కావడంతో ఏకంగా బ్లేడుతో గొంతు కోశాడు. అదృష్టం బాగుండటంతో ఆ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గంగంపేట కాలనీలో చోటు చేసుకుంది.  

వివరాల్లోకెళ్తే.. జగిత్యాల పట్టణంలోకి గంగంపేట కాలనీకి చెందిన షారుక్‌ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడు కూలీ పనులు చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన షారుక్‌ నిత్యం చుట్టు పక్కల వారితో.. ఇరుగుపొరుగు వారితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పీకల దాక తాగాడు. మళ్లీ మద్యం తాగేందుకు డబ్బులేవని, తన ఎదురింట్లో కిరాయి ఉంటున్న గౌస్‌ను రూ.200 అప్పు అడిగాడు.

కానీ, గౌస్ తన దగ్గర లేవనీ, తాను ఇవ్వలేదని తెగేసి చెప్పాడు.  దీంతో షారుక్‌ ఆగ్రహానికి గురయ్యాడు. తాను డబ్బులు అడిగితే ఇవ్వవా అంటూ.. గౌస్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన షారుక్ తన దగ్గర ఉన్న బ్లేడ్‌తో గౌస్‌ గొంతు కోశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గౌస్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా