పార్టీ మారినా కొండా సురేఖకు తిప్పలే: చిట్టెక్కకు విరామమే...

Published : Oct 19, 2018, 10:59 AM IST
పార్టీ మారినా కొండా సురేఖకు తిప్పలే: చిట్టెక్కకు విరామమే...

సారాంశం

సుస్మితా పాటిల్ అలియాస్ చిట్టెక్క కూడా భూపాలపల్లి నుంచి తాను పోటీ చేస్తానంటూ ఉవ్విళ్లూరారు. ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఫేస్ బుక్ పేజీతో కూడా సందడి చేశారు. అయితే, చివరకు ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.

వరంగల్: తన కూతురు సుస్మితా పాటిల్ అలియాస్ చిట్టెక్క విషయంలో కాంగ్రెసు నేత కొండా సురేఖ కొత్త పాట పాడుతున్నారు. తన కూతురును రాజకీయాల్లోకి దింపాలని వేసిన ప్లాన్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నుంచి తన కూతురు చేత పొలిటికల్ ఆరంగేట్రం చేయించాలని ఆమె భావించారు. 

సుస్మితా పాటిల్ అలియాస్ చిట్టెక్క కూడా భూపాలపల్లి నుంచి తాను పోటీ చేస్తానంటూ ఉవ్విళ్లూరారు. ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఫేస్ బుక్ పేజీతో కూడా సందడి చేశారు. అయితే, చివరకు ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. కొండా సురేఖకు తొలి జాబితాలో స్థానం దక్కకపోవడంతో టీఆర్ఎస్ పై తిరుగుబాటు ప్రకటించి కాంగ్రెసు పార్టీలో చేరారు. 

కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత కూడా ఆమెకు చిక్కులు తప్పలేదు. పార్టీ అధిష్టానం విధించిన నిబంధన సుస్మిత రాజకీయ రంగ ప్రవేశానికి ఆటంకంగా మారింది. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ అనే నిర్ణయం వల్ల సుస్మితకు టికెట్ దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొండా సురేఖ ఒక్కరే శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది.
 
 పరిస్థితి తన కూతురు రాజకీయ రంగ ప్రవేశానికి అనుకూలంగా లేకపోవడంతో తమ కూతురుకు రాజకీయాలంటే ఏహ్యభావం కలిగిందని, ఇప్పట్లో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని కొండా సురేఖ చెబుతున్నారు. తమ కూతురు గురించి ఎవరూ మాట్లాడవద్దని కొండా దంపతులు ఆదేశాలు కూడా జారీ చేశారు. వరంగల్ తూర్పు లేదా పరకాలలో ఎక్కడో ఒక నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేసే అవకాశాలున్నాయి.

సుస్మితా పటేల్‌ను మాత్రం హైదరాబాద్‌కే పరిమితం చేయాలని కొండా దంపతులు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సుస్మిత రాజకీయ ప్రవేశానికి తాత్కాలిక విరామం ప్రకటించినట్లు చెబుతున్నారు. తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత తాను వరంగల్ రానంటూ ఆగ్రహిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

చిట్టెక్క కోసం ప్లాన్: కేసీఆర్ కు కొండా దంపతుల సవాల్

కార్టూన్ పంచ్: మళ్లీ పార్టీ మారిన కొండా సురేఖ

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family