ముందు భోజనం పెడతారు.. తర్వాత అపాయింట్‌మెంట్ దొరకదు: కొండా మురళీ

By sivanagaprasad kodatiFirst Published Dec 22, 2018, 11:55 AM IST
Highlights

కేసీఆర్ అహంకారంతో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత కొండా మురళీధర్ రావు. తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విలువలు ముఖ్యం.. మనం చేసే పనులను ఎవరైనా ప్రశ్నిస్తేనే తప్పో ఒప్పో తెలుస్తుంది

కేసీఆర్ అహంకారంతో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత కొండా మురళీధర్ రావు. తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విలువలు ముఖ్యం.. మనం చేసే పనులను ఎవరైనా ప్రశ్నిస్తేనే తప్పో ఒప్పో తెలుస్తుంది.

కానీ ముఖ్యమంత్రి తన నిరంకుశ పరిపాలనను ఎవరు ప్రశ్నించకుండా చేయడానికే ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్నారని మురళీ ఆరోపించారు. షోకాజ్ నోటీసు వచ్చే లోపే ముందుగానే రాజీనామా చేశా.. మాకు నైతిక విలువలున్నాయని ఆయన అన్నారు.

ఏ మాత్రం నైతిక విలువలు లేకుండా కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారని మురళీ విమర్శించారు. కాంగ్రెస్ నుంచి బయటకు పోయేవాళ్లు ఆత్మాభిమానం చంపుకునేవాళ్లేనని ఆయన దుయ్యబట్టారు. సీఎం ముందు పిలిచి భోజనం పెడతారని ఆ తర్వాత అసలు అపాయింట్‌మెంట్ కూడా దొరకదని మురళీ ఆరోపించారు. 

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

click me!