Kompella Madhavi Latha: హైదరాబాద్ మజ్లిస్ కంచు కోట. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి బీజేపీ వ్యూహా రచన చేసింది. అసదుద్దీన్ కు పోటీగా కొంపెల్ల మాధవి లత (Kompella Madhavi Latha)ను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది కాషాయం పార్టీ. ఇంతకీ కొంపల్లి మాధవి లత ఎవరు? వది ఈ కథనంలో చూసేద్దాం..
Kompella Madhavi Latha: హైదరాబాద్ మజ్లిస్ కంచు కోట. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడానికి బీజేపీ వ్యూహా రచన చేసింది. అసదుద్దీన్ కు పోటీగా కొంపెల్ల మాధవి లత (Kompella Madhavi Latha)ను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది కాషాయం పార్టీ. ఇంతకీ కొంపల్లి మాధవి లత ఎవరు? వది ఈ కథనంలో చూసేద్దాం..
బాల్యం, వివాహం:
undefined
కొంపెల్ల మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన 'విరించి'కి చైర్మన్. ఆమె 1988 అక్టోబర్ 2న జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచి చదువుల్లో చాలా చురుకు. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన మాధవీ లత.. నిజాం కాలేజీలో బ్యాచలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లో ఈమె ఎన్ సీసీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది. అలాగే.. గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందారు. సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె కొంపెల్లి విశ్వనాథ్ గారిని వివాహం చేసుకున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు.. కొడుకు పేరు రామకృష్ణ పరమహంస, కూతుర్ల పేర్లు లోపాముద్ర, మోదిని. పెద్ద కుమార్తె ఐఐటి మద్రాస్ లో బీటెక్ చదువుతోంది. కుమారుడు అదే విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
సామాజిక కార్యక్రమాలు
రెండు దశాబ్దాలుగా లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె తన ప్రవచనాలు, ఇంటర్వ్యూలలో హిందు మత పద్ధతులు, సంప్రదాయాలు, పిల్లలను ఎలా పెంచాలి అనే చాలా విషయాలను వెల్లడిస్తారు.ప్రజాలకు మరింత సేవ చేయాలని ఉద్దేశంతో బిజెపిలో చేరారు. ముఖ్యంగా హైదరాబాద్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హిందుత్వం సనాతన ధర్మంపై బోధిస్తున్నారు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయట పెట్టారు. బిజెపి అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీ నుంచి పోటీ చేస్తాను అక్కడ అసలైన అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. ఆమె తరచుగా బాలికల విద్యను స్పాన్సర్ చేయడం. వెనుకబడిన వారి కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం కనిపిస్తుంది. ఆమె ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళా సంఘాలతో కలిసి 2019లో ప్రచారం చేసినట్టు సమాచారం.
బయోడేటా
పేరు: కొంపల్లి మాధవీలత
పుట్టిన తేదీ: జనవరి 30 1975,
వయసు :49 సంవత్సరాలు,
జన్మస్థలం: హైదరాబాద్,
విద్యార్హతలు: ఏంఏ
వృత్తి: రాజకీయవేత్త, సాంస్కృతిక కార్యకర్త, వ్యాపార మహిళ
రాజకీయ పార్టీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి)
భాగస్వామి: విశ్వనాథ్ (విరించి హాస్పిటల్ వ్యవస్థాపకుడు, చైర్మన్)
పిల్లలు: కొడుకు - రామకృష్ణ పరమహంస, కూతుర్లు- లోపాముద్ర, మోదిని
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మజ్లీస్ కంచుకోట. ఇక్కడ ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో 1984 నుంచి గత 40 ఏండ్ల నుంచి ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం ఎంఐఎం పార్టీదే. మాజ్లీస్ పార్టీ పాతబస్తీలో అంతగా పాతుకుపోయింది. దేశంలోని బీహార్, మహారాష్ట్ర చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో తన ప్రాబల్యాన్ని చాటుకున్నది.