మేం కలిసే ఉన్నాం, గొడవల్లేవ్: రేవంత్, కోమటిరెడ్డి మంతనాలు

Published : Jun 04, 2021, 02:36 PM IST
మేం కలిసే ఉన్నాం, గొడవల్లేవ్: రేవంత్, కోమటిరెడ్డి మంతనాలు

సారాంశం

మా మధ్య ఎలాంటి గొడవలు లేవని  భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

హైదరాబాద్:   మా మధ్య ఎలాంటి గొడవలు లేవని  భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలనే డిమాండ్ తో  రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ కు  కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నాడు వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు.  తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని కూడ ఆయన తేల్చి చెప్పారు. 

also read:ఉచితంగా కరోనా వ్యాక్సిన్ డిమాండ్: ఈ నెల 7న తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళన

టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. త్వరలోనే టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక జరగనుంది. ఈ తరుణంలో రాజ్ భవన్ వద్ద ఇద్దరు నేతలు  మాట్లాడుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  తాము ఇద్దరం కూడ కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. టీపీసీసీ చీఫ్ పదవి నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరాడు  మాణికం ఠాగూర్.  

పార్టీలో కొందరు నేతలు రేవంత్ రెడ్డికి ఈ పదవిని ఇవ్వొద్దని పరీక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదే విషయాన్ని గతంలో కూడ పార్టీ నాయకత్వం దృష్టికి కూడ కొందరు నేతలు తీసుకెళ్లారు.  ఈ తరుణంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మాట్లాడుకోవడం చర్చకు దారి తీసింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా