సభ్యత్వాల రద్దు: కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కోమటిరెడ్డి, సంపత్

First Published Jun 12, 2018, 6:25 PM IST
Highlights

ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై మరోసారి కోర్టుకు కాంగ్రెస్

హైదరాబాద్: నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు  అసెంబ్లీ కార్యదర్శిపై కోర్టు ధిక్కార  కేసును హైకోర్టులో దాఖలు చేశారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ కూడ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ ను కొట్టేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం నాడు జానారెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

కానీ, ఇంతవరకు కోర్టు తీర్పును అమలు చేయలేదు. దీంతో కోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కార పిటిషన్ ను ధాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జూన్ 22న విచారణ చేయనున్నట్టు కోర్టు ప్రకటించింది.

హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, అసెంబ్లీ అధికారులను కోరుతున్నారు. కానీ, ఇంతవరకు ఈ విషయమై సరైన స్పందన లేకపోవడంతో కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేశారు.
 

click me!