కెసిఆర్ పై 50వేల మెజార్టీతో గెలుస్తా

Published : Jul 15, 2017, 01:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కెసిఆర్ పై 50వేల మెజార్టీతో గెలుస్తా

సారాంశం

కెసిఆర్ నల్లగొండలో పోటీచేస్తే 50 మెజార్టీతో గెలుస్తా తెలంగాణ సర్కారు పతనం మొదలైంది అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్ గెలుపు ఆపలేరు

తెలంగాణ సిఎం కెసిఆర్ పై వరుస సవాళ్లు విరుసుతున్నారు సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గజ్వెల్ లోనే కెసిఆర్ ను ఓడిస్తానంటూ ఇటీవల సవాల్ చేసిన కోమటిరెడ్డి తాజాగా మరో సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌ నల్లగొండలో తనపై పోటీచేస్తే 50 వేల మెజార్టీతో గెలుస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటలో ఆయన మాట్లాడారు.

 

రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్‌ను ఓడించలేవన్నారు. మూడేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని పేదల, రైతుల శ్రేయ స్సే ధ్యేయమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పతనం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. మొత్తానికి కెసిఆర్ పై సవాళ్ల మీద సవాళ్లు విసరడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?