ఢిల్లీలో కోమటిరెడ్డి భావోద్వేగం

Published : Mar 21, 2018, 05:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఢిల్లీలో కోమటిరెడ్డి భావోద్వేగం

సారాంశం

నన్ను చంపేందుకు కేసిఆర్ కుట్ర నన్ను చంపితే వేల మంది ఎంకన్నలు పుట్టుకొస్తారు కేసిఆర్ కు సమాధి కడతారు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తనతోపాటు మరో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కోమటిరెడ్డి ఏమన్నారో కింద చదవండి.

కేసిఆర్ చాలా పిరికి వాడు. ప్రతిపక్ష నేత గన్ మెన్లను తొలగించడంలో ఏదో కుట్ర దాగి ఉంది. మా మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శీనును ఎట్లా సంపిండో నన్ను కూడా అట్లాగే చంపేందుకు కేసిఆర్ కుట్రలు చేస్తున్నడు. నాకేమైనా అయితే కేసిఆర్ దే బాధ్యత, ప్రభుత్వానిదే బాధ్యత అనేంత పిరికివాడని కాదు నేను. నన్ను చంపాలని కేసిఆర్ ప్లాన్ చేస్తున్నడు. మహా అంటే నేను పోతే.. నా కొడుకు దగ్గరికి పోతా కావొచ్చు. కానీ ఒక్క ఎంకన్న చస్తే.. వేలాది ఎంకన్నలు పుట్టుకొస్తారు. కేసిఆర్ ను సమాధి చేస్తారు జాగ్రత్త.

బొడ్డుపల్లి శ్రీను హత్య కేసులో నిందితుడు నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం. గతంలో వీరేశం ట్రైనీ ఐపిఎస్ మీద దాడి చేశాడు. మరో పోలీసాఫీసర్ మీద దాడి చేశాడు. కాల్ రికార్డ్స్ కూడా బయటకొచ్చాయి. అయినా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోలేదు. ఈ సమయంలో నా గన్ మెన్లు తొలగించడం చూస్తే కుట్ర తోనే జరిగిందని అర్థమైతున్నది.

తెలంగాణలో నేను కేసిఆర్ మీద పోటీ చేస్తా అని సవాల్ చేసిన. గజ్వేల్ లో పోటీ చేస్తా. కేసిఆర్ ను ఓడిస్తా అని సవాల్ చేసినందుకే నా మీద కక్ష పెట్టుకుని కుట్రలు చేస్తున్నడు. చాలా మందిని డబ్బులు ఇచ్చి కొన్నాడు. కాంట్రాక్టులు ఇచ్చి కొందరిని కొన్నాడు. అమ్ముడు పోని నాలాంటి వాళ్లను బెదిరిస్తున్నారు. అసలు భూమి మీద లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నావు.

నేను 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న. మాజీ మంత్రిగా పనిచేసిన. ఒక మాజీ మంత్రికి సహజంగానే గన్ మెన్లు ఉంటారు. కానీ దారుణంగా నాకు గన్ మెన్లు తొలగించారు. నేను చావుకు బయపడే వ్యక్తిని కాను.

కేసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడు. కేసిఆర్ కు గుణపాఠం తప్పదు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu