ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. లక్ష్య సాధన కోసం ఎటువంటి నిర్ణయమైన తీసుకుంటాను: రాజగోపాల్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Jun 24, 2023, 2:20 PM IST
Highlights

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారతానని వస్తున్న వార్తలను ఖండించారు. తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. తనపై వచ్చే ఊహగానాలను నమ్మవద్దని కోరారు.

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారతానని వస్తున్న వార్తలను ఖండించారు. తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. తనపై వచ్చే ఊహగానాలను నమ్మవద్దని కోరారు. బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్తున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో పరిస్థితులను బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలకు వివరిస్తానని తెలిపారు. కొన్ని  కీలకమైన మార్పులు చేసే అవకాశం ఉందని.. అందుకే తమను పిలిచినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని.. అందుకే బీజేపీలో చేరానని తెలిపారు. లక్ష్య సాధన కోసం ఎటువంటి  నిర్ణయమైనా తీసుకుంటానని చెప్పారు. అలాంటేది ఏదైనా  ఉంటే తానే చెబుతున్నానని.. సోషల్  మీడియాలో వచ్చే ఊహగానాలను నమ్మవద్దని కోరారు. తాము ప్రస్తుతం బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. 

ఇదిలా ఉంటే, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి పార్టీ తీరుపై అసంతృప్తితో  ఉన్నారు. ఈ క్రమంలోనే వారు పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే ప్రచారం సాగుతుంది. మరోవైపు పార్టీలో మరికొందరు నేతలు కూడా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం నష్టనివారణ చర్యలకు దిగింది. ఢిల్లీకి రావాలంటూ ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను పిలిచింది. 

Latest Videos

Also Read: వ్యూహం టీజర్ విడుదల.. వైఎస్సార్ మరణంతో ఓపెనింగ్.. ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తుందా?

దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు ఈరోజు జేపీ నడ్డాను కలిసి.. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే కుదరితే అమిత్ షా‌తో కూడా వారు సమావేశమయ్యే అవకాశం ఉంది.

click me!