మా సోదరుల మధ్య విబేధాల్లేవు, కాంగ్రెస్ లో ఏమైనా జరగొచ్చు: కోమటిరెడ్డి సంచలనం

Published : Mar 22, 2021, 06:23 PM IST
మా  సోదరుల మధ్య విబేధాల్లేవు, కాంగ్రెస్ లో ఏమైనా జరగొచ్చు: కోమటిరెడ్డి సంచలనం

సారాంశం

తనకు తన సోదరుడి మధ్య ఎలాంటి విబేధాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.   

హైదరాబాద్: తనకు తన సోదరుడి మధ్య ఎలాంటి విబేధాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విబేధాలు లేవని ఆయన చెప్పారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందన్నారు.

నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై సానుభూతి ఉందని ఆయన చెప్పారు. జానారెడ్డి చేసిన పనులు, అభివృద్ది, సింపతే ఆయన్ను గెలిపిస్తోందన్నారు.

30 ఏళ్ల నుండి రాజకీయాలు చేస్తున్న జానారెడ్డికి ఇంకొకరి ప్రచారం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్, తీన్మార్ మల్లన్న, రామచందరావు ఓడి గెలిచారని ఆయన అభిప్రాయపడ్డారు.

 టీఆర్ఎస్ ప్రజల్లో ఓడిందన్నారు. తెలంగాణ ప్రజలు ఫైటర్స్ కే సపోర్టు చేస్తారని మల్లన్న ఓట్లు చూశాక అర్ధమైందన్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఆయన చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ , కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినట్టుగా ఎవరైనా ఏమైనా కావొచ్చని ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!