జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ కి బెయిల్‌లో ట్విస్ట్: షూరిటీకి రేపటితో ముగియనున్న గడువు

By narsimha lodeFirst Published Mar 22, 2021, 4:46 PM IST
Highlights

 బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ చేసుకొంది.  ఈ కేసులో  ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లు బెయిల్ పొందేందుకు అవసరమైన  షూరిటీస్ ను ఇంకా ఇవ్వలేదు. రేపటితో షూరిటీస్ ఇవ్వకపోతే  బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.
 


హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ చేసుకొంది.  ఈ కేసులో  ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లు బెయిల్ పొందేందుకు అవసరమైన  షూరిటీస్ ను ఇంకా ఇవ్వలేదు. రేపటితో షూరిటీస్ ఇవ్వకపోతే  బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 9వ తేదీన భార్గవ్ రామ్ , జగత్ విఖ్యాత్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కోసం  షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

రేపటి లోపుగా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ లు షూరిటీలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిల షూరిటీలను  బోయిన్ పల్లి పోలీసులు తిరస్కరించారు.

ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులు షూరిటీలు సమర్పించకుండా కాలాయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. తమ షూరిటీలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.  వీరిద్దరి బెయిల్ పిటిషన్లను సికింద్రాబాద్ కోర్టు రద్దు చేయడంతో  హైకోర్టును ఆశ్రయించారు.
 

click me!