అవినీతి సొమ్ముతో ఢిల్లీలో 600 మద్యం షాపులు.. ఎమ్మెల్సీ కవిత అరెస్టవ్వడం ఖాయం... కోమటిరెడ్డి...

Published : Mar 04, 2023, 02:06 PM IST
అవినీతి సొమ్ముతో ఢిల్లీలో 600 మద్యం షాపులు.. ఎమ్మెల్సీ కవిత అరెస్టవ్వడం ఖాయం... కోమటిరెడ్డి...

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో త్వరలో కవిత అరెస్ట్ ఖాయమని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 

తిరుపతి : లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కూతురు అరెస్ట్ అవడం ఖాయం అంటూ బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు తప్పదంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ లపై కూడా  కోమటిరెడ్డి విమర్శలు చేశారు. తిరుమల పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను మళ్లించడం కోసమే బిఆర్ఎస్ గా పేరు మార్చారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలతో గులాబీ నేతలకు పార్టీపై వ్యతిరేకత ఉందన్న విషయం తెలిసిందన్నారు.  వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటమి ఖాయమన్నారు. కేసీఆర్ కు  వ్యతిరేకంగా తాను యుద్ధం చేశానని తెలిపారు. ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన తెలంగాణ  రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని జోస్యం పలికారు. 

మహిళలపై అత్యాచారాలకు నిరసనగా దీక్షకు సిద్దమైన బండి సంజయ్.. వివరాలు ఇవే..

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ  నాపై తప్పుడు ఆరోపణలు చేశారు.  కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి దమ్ముంటే  నా అవినీతి ఏంటో నిరూపించాలన్నారు. నా జీవితంలో నేను ఎప్పుడూ డబ్బుకు లొంగలేదని  చెప్పుకొచ్చారు.  ఈ మేరకు సవాల్ విసిరారు.  ఎమ్మెల్సీ కవిత  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కావడం ఖాయం’ అంటూ  కుండబద్దలు కొట్టారు.  ఢిల్లీలో 600 మద్యం షాపులను అవినీతి సొమ్ముతోనే కవిత పెట్టారని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 

ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులపై గురువారం ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బిజెపి నేతలు చెప్పినట్లుగా అరెస్టులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారని బిజెపి నేతలు ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిమీద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు. ఎప్పుడు ఎవరిని.. ఏయే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయాలని బిజెపి నేతలు చెబుతారా అని ప్రశ్నించారు.  ఇలా బిజెపి నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యల వల్ల బిజెపి నేతలకే చెడ్డ పేరు వస్తుందని..  ఆ నేతలు చెప్పినట్లుగానే దర్యాప్తు సంస్థలు నడుచుకున్నట్టుగా బయటపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలతో బీజేపీకి మ్యాచ్ ఫిక్సింగ్ కు అద్దం పడుతున్నాయని అన్నారు. ఈడి, సిబిఐ దాడులు అదానీపై ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారు చెప్పొద్దని బిజెపి నేతలకు చెప్పాలని ఆమె తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను  కోరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజీ వాళ్ళ పేర్లు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం లోని రెండో ఛార్జ్ షీట్ లో చేర్చారు. కాగా ఈ చార్జి షీట్ ను అరవింద్ కేజ్రీవాల్ తప్పులు తడక అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ