సొంత ఇల్లులేదు, కారు లేదు కానీ.. ఆస్తులు మాత్రం రూ.300కోట్లు

By ramya neerukondaFirst Published Nov 17, 2018, 3:38 PM IST
Highlights

అఫిడవిట్ లో ఆయన పేర్కొన్న లెక్కల ప్రకారం.. ఆయన పేరిట, ఆయన భార్య పేరిట మొత్తం రూ.300కోట్లపైమాటే ఆస్తులు ఉన్నాయి

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. ఆయన తన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు. అఫిడవిట్ లో ఆయన పేర్కొన్న లెక్కల ప్రకారం.. ఆయన పేరిట, ఆయన భార్య పేరిట మొత్తం రూ.300కోట్లపైమాటే ఆస్తులు ఉన్నాయి.

అయితే.. అన్ని ఆస్తులు ఉన్నా.. ఆయన పేరిట సొంత ఇల్లు కూడా లేకపోవడం గమనార్హం. తన పేరిట కమర్షియల్ భవనాలు రెండు ఉన్నాయని,. వాటి విలువ రూ.7కోట్లు అని చెప్పిన ఆయన.. సొంత ఇల్లు మాత్రం లేదని పేర్కొన్నారు. కాగా.. ఆయన భార్య పేరిట రూ.13కోట్లు విలువచేసే రెండు భవనాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. సొంత కారు కూడా తనకు లేదని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

కోమటిరెడ్డి సంవత్సర ఆదాయం రూ.34లక్షలు కాగా.. ఆయన భార్య లక్ష్మీ సంవత్సర ఆదాయం రూ.1.1కోట్లు, ఇక రాజగోపాల్ రెడ్డి పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.రూ.5కోట్లు కాగా, ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.261 కోట్లు, స్థిరాస్తులు..రాజగోపాల్‌రెడ్డి పేరిట రూ. 19.5 కోట్లు,లక్ష్మీ పేరిట రూ. 28 కోట్లు. అప్పులు...రాజగోపాల్ పేరిట రూ. 23 లక్షలు లక్ష్మీ పేరిట రూ. 6.4 లక్షలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 
 

click me!